హారిక నా చెల్లి.. అభిజిత్ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌-4 ముగియగా.. దాని గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ, వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. హౌస్‌లోని అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చినవారికి సినిమాలు, టీవీ షోలలో అవకాశాలు కూడా వస్తున్నాయి.

harika and abhijeet

అయితే ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సంచలన విషయాలు బయటపెడుతున్నారు. తాజాగా దేత్తడి హారిక గురించి బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె తనకు చెల్లి అంటూ ఒక ఇంటర్వ్యూలో అభిజిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిగ్‌బాస్ హౌస్‌లోనే ఆమెకు ఈ విషయాన్ని చెప్పానని, కానీ దానికి బయటికి చూపించలేదన్నాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, హారిక లాంటి సిస్టర్ ఉంటే బాగుండేదని అభిజిత్ చెప్పాడు.

బిగ్‌బాస్ నిర్వాహకులు తాను ఆమెను చెల్లి అని పిలిచిన వాటిని ప్రసారం చేయలేదని, దాని వల్ల తమ మధ్య ప్రేమ ఉన్నట్లు ప్రేక్షకులు అర్థం చేసుకున్నారని అభిజిత్ చెప్పాడు. బిగ్‌బాస్‌లో హారిక, అభిజిత్ మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి వారిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడం, హగ్గులు ఇచ్చుకోవడంతో నిజమేనని అందరూ నమ్మారు. అభిజిత్, హారిక పేరెంట్స్ కూడా వారిద్దరి పెళ్లి చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇప్పుడు అభిజిత్ అసలు విషయం బయటపెట్టడంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.