Aamir Khan:ఆమిర్ ఖాన్‌పై దారుణమైన ట్రోలింగ్

ఆమిర్ ఖాన్ కిరణ్ రావ్ విడాకుల వ్యవహారం కొత్త కొత్త టాపిక్‌లకు తెరదీస్తోంది. ఆమిర్ ఖాన్ విడాకుల వార్తపై సోషల్ మీడియా లో ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్ల వెల్లువెత్తుతున్నాయి. ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి సిద్దమవుతున్నాడని దంగల్ సినిమాలో తన కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్‌ను వివాహామాడబోతోన్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. రీల్ లైఫ్ డాటర్.. రియల్ లైఫ్ వైఫ్‌గా మారబోతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఫాతిమా పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా ఫాతిమా – ఆమిర్ ఖాన్ వ్యవహారంలో ఎంత మటుకు నిజంఉంది అనేది తేలాల్సివుంది.