చిత్రీకరణ చివరి దశలో ఆమని “అమ్మ దీవెన”

aamani

సత్య ప్రకాష్ తనయుడు నటరాజ్ ను హీరోగా పరిచయం చెస్తూ, ఆమని, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతొన్న చిత్రం “అమ్మ దీవెన”. శివ ఏటూరి దర్శకుడు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎత్తరి గురవయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ.. “అమ్మ దీవెన ” ప్రతి తల్లి తన కుటుంబం కోసం పడే‌ కష్టం, ఆరాటం,జీవన పోరాటాలను ప్రధానాంశంగా తీసుకుని తీస్తొన్న చిత్రం .చివరి షెడ్యూల్ చిత్రీకరణ త్వరలో చెయనున్నాము. ఒక పాట , ఒక ఫైట్ మినహా చిత్రీకరణ పూర్తయింది.మదర్ సెంటిమెంట్ తో పాటు యూత్ ను ఆకట్టుకునె అంశాలతో ఈ చిత్రముంటుందని అన్నారు.‌

నిర్మాత గురవయ్య మాట్లాడుతూ.. మా కుటుంబం లొ జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తీస్తొన్న చిత్రమిది. ఆమని‌ గారి పాత్రలొ ప్రతి కొడుకు తమ తల్లిని చూసుకుంటారు. దర్శకుడు శివ ఈ కథను అద్భుతంగా తెరమీదకు తీసుకు వస్తున్నారు.నటీనటుల సహకారం మరువలేనిది.
త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు

నటరాజ్, శ్రీ పల్లవి, ఆమని, పోసాని, సత్య ప్రకాష్, శరణ్య (ఫిదా ఫేం),శృతి, అరుణ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.వి.హెచ్ ,కెమెరా: సిద్దం మనో హర్, డాన్స్: గణేష్ స్వామి, నాగరాజు, ఫైట్స్: నందు, కథ : ఎత్తరి మారయ్య, మాటలు: శ్రీను.బి, ఎడిటర్: జె.పి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : పవన్ , నిర్మాత: ఎత్తరి గురవయ్య, దర్శకుడు: శివ ఏటూరి.