డబుల్ ట్రీట్ ఇచ్చిన ఆది

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ రోజు ఆది పుట్టినరోజు సందర్భంగా.. అతడు నటిస్తున్న ‘బ్లాక్’ సినిమాకు సంబంధించిన ఒక లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఆది కనిపిస్తున్నాడు. ఒక లుక్‌లో ఆది నార్మల్‌ లుక్‌లో కనిపిస్తుండగా. మరొక లుక్‌లో చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఆది గత రెండు సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమాపై ఆది ఆశలు పెట్టుకున్నాడు.

aadi sai kumar

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కొత్త డైరెక్టర్ జి.బి కృష్ణ డైరెక్షన్‌లో మహంకాళీ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఆది పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. దర్శన బానిక్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.

త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించే అవకాశముంది. ఇక ఆది సాయికుమార్ ప్రస్తుతం నటిస్తున్న ‘శశి’ సినిమా టీజర్‌ను ఇవాళ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ టీజర్‌లో కూడా ఆది కొత్త లుక్‌లో కనిపించాడు. ఇందులో ఆదికి జోడీగా సురభి, రాశీ సింగ్‌ నటిస్తున్నారు. శ్రీ హానుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.