మోస్ట్ పవర్ ఫుల్ కాప్ గా ఆది సాయి కుమార్

హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హీరో ఆది సాయి కుమార్. రిజల్ట్ ని పక్కన పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలని సైన్ చేస్తున్న ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్. అమరన్- ఇన్ ది సిటీ- చాప్టర్ 1 అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో ఆది పక్కన అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. బలవీర్ డైరెక్ట్ చేస్తున్న అమరన్ మూవీని జెమినీ ప్రెజెంట్ చేస్తుండడం విశేషం. అమరన్ సినిమాలో ఆది సాయి కుమార్ కార్తి వల్లభన్ అనే పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ అమరన్ మూవీ నుంచి ఆది లుక్ ని రిలీజ్ చేశారు. సాలిడ్ బిల్ట్ బాడిలో ఆది చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.