
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ముంబైలో అత్యంత సింపుల్‌గా, సైలెంట్‌గా జరిగినట్లు సమాచారం. ఈ వేడుకకు బయటి వ్యక్తులను ఎవరినీ ఆహ్వానించలేదని, కేవలం సన్నిహిత బృందంతోనే కార్యక్రమం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్, షూటింగ్‌ను కూడా సీక్రెట్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముంబైతో పాటు విదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తుండగా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ ఖాతాలో మరో సంచలన విజయాన్ని రికార్డ్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా వివరాలపై మరింత సమాచారం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.