ఇటీవలే విడుదల అయిన మాస్ మహారాజ రవితేజ ఈగల్ మూవి మీక్సీడ్ టాక్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుది. కారియర్ మొదటిలో డిఓపిగా పని చేసి, తరువాత డైరెక్టర్ గా మారి మంచి సినిమాలనే అందించారు. అయితే ఈగల్ సినిమాకి వస్తే మొదటి హాఫ్ సినిమా అంతగా ప్రేక్షకులని అలరించనప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం అదరకొట్టేసింది అని చెప్పుకోవాలి. కార్తీక్ డైరెక్షన్ కి తోడు బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.
ఈ సినిమాకి సంగీతం అందించిన దేవ్ జాంద్ ప్రేక్షకులను సీట్ ఎడ్జిలో కుర్చోపెట్టేసారు. సంగీత దర్శకునిగా మొదటి సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల పల్స్ బాగానే పట్టుకున్నారు. కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ కి దేవ్ జాంద్సంగీతం తోడు కావడం ఈగల్ సినిమాకి మంచిది అయింది. ఇక సినిమాలోని పాటలు అయితే చెప్పనవసరం లేదు. ప్రతి పాతకి తనదైన శైలిలో మ్యూజిక్ అందించారు. అటు బిజిఎం కి స్టైలిష్ మాస్ బీట్ తో పాటు, మెలోడీ పాటలకి డీసెంట్ మ్యూజిక్ బాగా అందించారు.
అయితే తన తరువాత సినిమా అయిన మిరాయి ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈగల్ సినిమాలో ఆయన అందించిన సంగీతానికి మిరాయి సినిమా పై మ్యూజిక్ విష్యాలో ఎక్కువగానే ఎక్సపెక్టషన్స్ పెట్టుకునేలా చేసాడు ఈ నవ యువ సంగీత దర్శకుడు దేవ్ జాంద్. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లో ఓ సినిమాకి, కార్తీక్ ఘట్టమనేని తో రెండు సినిమాలకి ఆయన ఒప్పుకున్నట్లు తెలిసింది. అలాగే నక్కిన నరేటివ్స్ లో రాబోతున్న చౌర్య పాఠం సినిమాకి దేవ్ జాంద్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి సినిమాకే అంతటి సంగీతం అందించడంతో దేవ్ జాంద్ పైన మంచి నమ్మకం తో పెద్ద సినిమాలకి తీసుకోవడం గొప్ప విష్యం అనే చెప్పుకోవాలి.