Hyderabad: సోనూసూద్ పేరిట భారీ మోసం చేసిన వ్య‌క్తి రిమాండ్‌..

Hyderabad: ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేశ ప్ర‌జ‌ల్లో రియ‌ల్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో గానీ, ఆ త‌ర్వాత గానీ అనుకోకుండా ఆప‌ద‌లో ఉన్న‌వారికి స‌హ‌యం చేసే దేవుడయ్యాడు. దీంతో ఆయ‌న‌పై దేశ ప్ర‌జ‌లు ఎంతో అభిమానాన్ని చూపిస్తారు.

sonusood News

ఇలాంటి త‌రుణంలో సోనూసూద్ పేరుతో ఆశిష్‌కుమార్ అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్ అకౌంట్ ఓపెన్ చేయ‌గా.. ఆ అకౌంట్‌కు భారీగా నిధులు పంపించారు. తీరా చూస్తే అది సోనూ అకౌంట్ కాద‌ని తెలిసి మోస‌పోయిన బాధితులు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. దీంతో ఆశిష్‌ను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.