పవర్ స్టార్ సినిమాకు హైప్ క్రియేట్ చేయాలని వర్మ వేస్తున్న ప్లాన్స్ అన్ని ఇన్ని కావు. ఏం జరిగినా సరే ఫైనల్ గా పవర్ స్టార్ సినిమా హైలెట్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. గత రాత్రి రామ్ గోపాల్ వర్మ కంపెనీ కార్యాలయంపై దాడి జరిగినట్లు వర్మ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
8 మందిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే వారిపై నమోదు చేసిన కేసును విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. వర్మ అనుచరులు మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంట్ తో పోలీసులు వారిని వదిలేస్తున్నట్లు సమాచారం. అయితే వర్మ ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు టాక్ వస్తోంది. అదే విధంగా బయపడ్డాడా అనే రూమర్స్ కూడా వస్తున్నాయి.
వచ్చింది ఎవరి ఫ్యాన్స్ అనే విషయంలో క్లారిటీ ఇవ్వని వర్మ ఇక నుంచి తనపై దాడి చేయడానికి ఎవరైనా వస్తే గాజులు తొడుక్కొని కూర్చోలేదని మీడియాలో సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పవర్ స్టార్ సినిమా తరువాత ఇంకా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే సందేహాలు వెలువడుతున్నాయి.