టెలివిజన్ ఇండస్ట్రీలో జబర్దస్త్ హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనసూయా భరద్వాజ్ అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని డిఫరెంట్ పాత్రలో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక త్వరలో ఆమె ఒక తల్లి పాత్రలో నటించనుందని టాక్ వచ్చింది.
యువ హీరో సుమంత్ అశ్విన్ త్వరలో ఒక రొమాంటిక్ క్యూట్ లవ్ స్టోరీ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఆ కథలో హీరో తల్లి పాత్ర చాలా కీలకమని అనసూయాను ఎంచుకున్నట్లు కథనాలు వచ్చయి. ఇక రూమర్స్ డోస్ ఎక్కువవ్వడంతో అమ్మడు స్పందించక తప్పలేదు. ఈ విషయం అనసూయా దగ్గరకు వెళ్లగా అందులో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో అలాంటి పాత్రల కోసం తనను ఎవరు కలవలేదని ఒక్క మాటతో రూమర్స్ కి ఎండ్ కార్డ్ పెట్టింది. మరి భవిష్యత్తులో ఇలాంటి ఆఫర్స్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో..?