హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ గత పదేళ్ల నుంచి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆమె బాలకృష్ణ గురించి మాట్లాడడం వైరల్ గా మారింది. మన బాలయ్య నేర్పిన టెక్నీక్స్ ఆమె కెరీర్ కి చాలానే ఉపయోగ పడ్డాయట. బాలకృష్ణతో కత్రినా కైఫ్ 2005లో అల్లరి పిడుగు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడిన కత్రినా బాలకృష్ణ డ్యాన్స్ విషయంలో నేర్పిన టెక్నీక్స్ గురించి చెప్పింది. మొదట్లో తనకు డ్యాన్స్ మూమెంట్స్ అంటే ఎంటో కూడా అర్థం అయ్యేవి కాదని చిన్న పిల్లల మాదిరిగా డ్యాన్స్ చేస్తాను అంటూ కొందరు తిట్టారని చెప్పింది. అయితే బాలకృష్ణతో సినిమా చేసే సమయంలో డ్యాన్స్ చేసేటప్పుడు కొన్ని మెళకువలు నేర్పించారని కెమెరా ముందు ఎలా నడుచుకోవాలి. పాటకు తగ్గట్టుగా మూమెంట్స్ ఎలా ఇవ్వాలని విషయంలో నాకు పూర్తి అవగాహన కల్పించారు అంటూ అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నానని కత్రినా వివరణ ఇచ్చింది.