ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన భారత దేశం లో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది . ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా పై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీ ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు, తెలంగాణ సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.