‘బాహుబలి’, ‘ప్రతిరోజూపండగే’ వంటి చిత్రాలతో తెలుగులోనూ అభిమానులని ఏర్పరచుకున్న సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘తీర్పుగళ్ విర్కపడుమ్`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎమర్జెన్సీ` పేరుతో హనీబి క్రియేషన్స్ పతాకంపై మీరాసాహిబ్ రాథర్ ఈ చిత్రాన్నివిడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ధీరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సత్యరాజ్ కుమార్తెగా స్మృతి వెంకట్ నటిస్తోంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ సినీ పరిశ్రమలో మొదటి సారిగా అగ్రశ్రేణి కెమెరాలు ఉపయోగించి ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తయింది. 12 గంటలపాటు నిర్విరామంగా డబ్బింగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు సత్యరాజ్. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ధీరన్ మాట్లాడుతూ – ” ఈ సినిమాలో సత్యరాజ్ సార్‌తో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఓ తండ్రి పోరాడే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇందులో సత్యరాజ్ వైద్య కళాశాల ప్రొఫసర్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా కీలకం. మహిళలకు ఇది చాలా ముఖ్యమైన చిత్రం. నేటి సమాజంలోని దుర్మార్గులను ప్రశ్నించే చిత్రమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్క్రిప్ట్ పేపర్లలో నేను రూపొందించిన పాత్రకు తన సహజమైన నటన ద్వారా పూర్తి న్యాయం చేశారు సత్యరాజ్. ఆయనతో పనిచేసిన తరువాత, అతని కృషికి, అంకితభావానికి చాలా పెద్ద అభిమానిని అయ్యాను. చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో టీజర్‌ను విడుదల చేయనున్నాం,” అన్నారు.
సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి..సంగీతం: ప్రసాద్ ఎస్ఎన్, సినిమాటోగ్రఫీ: ‘గరుడవేగ’ అంజి , స్టంట్స్: దినేష్ సుబ్బరాయన్, ఎడిటర్: నౌఫల్ అబ్దుల్లా, నిర్మాత: మీరాసాహిబ్ రాథర్, దర్శకత్వం: ధీరన్.