గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆర్ ఆర్ ఆర్ తప్ప ఇంకో మ్యాటర్ లేదు. ఈ టాపిక్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్న విధానం చూస్తుంటే జక్కన సినిమా కోసం, ఎన్టీఆర్ చరణ్ ల కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధమవుతుంది. ఇండిపెండెన్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ ఫిక్షనల్ సినిమా ఇప్పటకే 70% ప్రసెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన రాజమౌళి, ఈసారి ట్రిపుల్ ఆర్ ని ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
వరల్డ్ వైడ్ మంచి ఆర్టిస్టులని కాస్టింగ్ చేసిన రాజమౌళి, ట్రిపుల్ ఆర్ స్కేల్ పెంచుతూ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. తెలుగు తమిళ హిందీ భాషల్లో మాత్రమే కాకుండా ఆర్ ఆర్ ఆర్ ని పది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఇంగ్లీష్ జాపనీస్ చైనీస్ ఫ్రెంచ్ జెర్మన్ భాషలు ఉన్నాయి. బాహుబలి 2 సినిమాని భారతీయ భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు, ఆ తర్వాత జపాన్ లో విడుదల చేశారు. జపాన్ లో బాహుబలి డ్రీం రన్ ని సొంతం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఈ స్పాన్ ని మరింత పెంచుతూ అన్ని మెయిన్ లాంగ్వేజస్ ని రిలీజ్ చేయబోతున్నారు. సో బాహుబలి 2 వచ్చి రెండేళ్లు అయినా బ్రేక్ కానీ రికార్డ్స్ ని రాజమౌళిని బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.