మార్చి 29న విడుదల కానున్న నిఖిల్ అర్జున్ సురవరం చిత్రం

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రానికి ముందుగా ముద్ర టైటిల్ ఖరారు చేసినా.. ఇప్పుడు ఆ టైటిల్ ను అర్జున్ సురవరంగా మార్చారు చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగో విడుదలైంది. ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో హీరో నిఖిల్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు సంతోష్, నిర్మాతలు పాల్గొన్నారు. యూరప్ లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు అర్జున్ సురవరం చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

న‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు..

సాంకేతిన నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు
నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఫైట్స్: వెంక‌ట్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: రాగా రెడ్డి
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ
ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్