నయనతార, మలయాళ సినిమాతో వెండితెరపై మెరిసినా రజినీకాంత్ తో నటించిన చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యే వరకూ తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని పేరు. మొదటి సినిమాలో డీసెంట్ గా కనిపించిన నయన్, గజినీ సినిమాలో గ్లామర్ పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. నెమ్మదిగా తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిన నయనతార, తెలుగు తమిళ మలయాళ భాషల్లో అందరు స్టార్ హీరోలతో నటించింది. ఇక తనకంటూ ప్రత్యేక మార్కెట్ వచ్చింది అనుకున్న తర్వాత నయన్, సోలో హీరోయిన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టింది.
సోలో హీరోయిన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత నయన్ పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటిని తట్టుకోని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన నయనతార, లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించిన మలయాళీ అమ్మాయి ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తోంది. దాదాపు ఆరేడేళ్లుగా అదే పొజిషన్ లో ఉన్న నయనతార సినిమా రిలీజ్ అవుతుంది అంటే టాప్ హీరోలు కూడా వాళ్ల సినిమాలని వాయిదా వేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. అలాగే సోలో సినిమాలు చేస్తుంటే హీరోల పక్కన కూడా నటిస్తున్న నయనతార. ఆమె ఉంటే సినిమా మార్కెట్ పెరుగుతుంది, ఆమె కోసమే థియేటర్స్ కి వచ్చే అభిమానులు ఉన్నారు అనే నమ్మకం కలిగించింది.
ఎన్ని సినిమాలు చేసినా నయనతార, వాటి ప్రొమోషన్స్ కి మాత్రం దూరంగా ఉంటుంది. ఎప్పుడూ తను నటించిన సినిమా గురించి బయట ఒక్క మాట కూడా మాట్లాడి ప్రోమోట్ చేయని ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమే అయి ఉండి ఉంటుంది. ఇంతకీ అసలు నయన్, ఎందుకు ప్రమోషనల్ ఈవెంట్స్ కి రాదు అనే డౌట్ అందరిలోనూ ఉండేది. ఎవరెన్ని విమర్శలు చేసినా, తనపై ఏ వివాదం జరిగినా నయన్ మాత్రం బయటకి రాదు ఒక్క మాట కూడా మాట్లాడాదు. సోషల్ మీడియాలో కూడా కనిపించని నయనతారని సినిమాల్లో మాత్రమే చూడాలి అంత ప్రైవసీ మైంటైన్ చేసే నయన్, దాదాపు దశాబ్దం తర్వాత మొదటిసారి ఈ విషయంపై స్పందించింది. ఓగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నయనతార, రీసెంట్ గా జరిగిన ఓగ్ ఫోటోషూట్ లో పాల్గోని ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.
ఈ సందర్భంగా తాను ఎందుకు మీడియాకి దూరంగా ఉంటుందో చెప్పిన నయన్, జనరల్త గానే తాను చాలా ప్రైవేట్ పర్సన్ అని… తన గురించి ఎవరికీ పెద్దగా తెలియడం తనకి ఇష్టం లేదని చెప్పింది. ఇది మాత్రానే కాకుండా తన మాటలని మీడియా చాలా సార్లు తప్పుగా ప్రచారం చేసిందని, తన మాటల వెనుక ఉన్న ఇంటెన్షన్ ని మార్చి చూపించారని అందుకే తాను మీడియాకి దూరంగా ఉంటానని చెప్పింది. తను ఒక నటిని మాత్రమే అని, తన సినిమాలే మాత్రమే మాట్లాడుతాయని నయన్ చెప్పుకొచ్చింది. సో దశాబ్ద కాలంగా నయనతార మీడియా ముందుకి, సోషల్ మీడియాలోకి ఎందుకు రాదు అనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది.
Read: వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మహేష్ , నయన్, దుల్కర్