


ధనుష్-నాగార్జున హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ‘కుబేర’ సెకండ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో ఉన్న ఈ వీడియో, ప్రేక్షకులను కుబేర డార్క్ అండ్ హిప్నోటిక్ వరల్డ్ లోకి తీసుకెలుతోంది. సినిమాలోని కీలక పాత్రలను, వారు క్రియేట్ చేయబోయే తుఫానును అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ధనుష్, విజనరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, రాక్ స్టార్ శ్రీ ప్రసాద్ కలిసి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. ఈ సినిమా లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుందని ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ ప్రామిస్ చేస్తోంది.
ఈ ఎక్సయిటింగ్ టీజర్‌లో డీఎస్‌పీ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. “నాది నాది నాది నాదే ఈ లోకమంతా” అనే హిప్నాటిక్ కోరస్ అదిరిపోయింది. నంద కిషోర్ రచించిన ఈ పాటను ధనుష్, హేమచంద్ర వేదాల కలిసి తన డైనమిక్ వోకల్స్ తో అదరగొట్టారు. ఎస్.పి. అభిషేక్, శెణ్బగరాజ్, సాయి శరణ్, శ్రీధర్ రమేష్, భరత్ కె రాజేశ్ తమ ఎనర్జిటిక్ వోకల్స్ తో హార్మొనీలను యాడ్ చేశారు. ఈ పాట కుబేర వరల్డ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
నాగార్జున ఫవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఆయన పాత్ర బలమైనది, భావోద్వేగంతో కూడినది, విలువలతో నడుచుకునే వ్యక్తిలా కనిపించినా అంతర్గతంగా ఎన్నో ప్రశ్నలతో ఉన్నట్టుగా ఉంది. ఆయన పాత్రను మంచో చెడో అనలేని విధంగా రూపొందించటం సినిమా పట్ల ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచుతుంది.


ఈ టీజర్‌లో రష్మిక మందన్న, జిమ్ సర్భ్ ల పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రతి పాత్ర మిస్టీరియస్, డేంజరస్ గేమ్ లో భాగమైనట్లుగా కనిపిస్తోంది. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ రెగ్యులర్ టీజర్లకు భిన్నంగా, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా రూపొందించబడం మేకర్స్ బోల్డ్ నిర్ణయాన్ని ప్రజెంట్ చేస్తోంది.
నాగార్జున, ధనుష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, శేఖర్ కమ్ముల విజనరీ నెరేటివ్, డీఎస్‌పీ అందించిన మెస్మరైజింగ్ మ్యూజిక్.. ఇవన్నీ కలిసిన ఈ పాన్ ఇండియన్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా జానర్ ని రిడిఫైన్ చేసేలా వున్నాయి.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన కుబేర చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది.