‘థగ్ లైఫ్’ ప్రేక్ష‌కుల‌ను సినిమా మెప్పిస్తుంది: క‌మ‌ల్ హాస‌న్‌

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్ష‌న్‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా చెన్నైలో భారీ ఆడియో లాంచ్ ఈవెంట్ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో…

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ మాట్లాడుతూ ‘‘ఈ జ‌ర్నీలో నాతో క‌లిసి ఎంద‌రో ఉన్నారు. ఇప్ప‌టికీ వారు త‌మ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నారు. గుండెల్లో ఎంతో క‌న్నీరుంది. సంతోషంతో వ‌చ్చే క‌న్నీరుంది.. బాధ‌తో నిండిన క‌న్నీరు కూడా ఉంది. ఎంతో మంది, ఎన్నో త‌రాలుగా న‌న్ను ఆద‌రిస్తున్నారు. వారికి ధ‌న్య‌వాదాలు త‌ప్ప మ‌రేం చెప్ప‌లేను. నేను సినిమాకు పెద్ద అభిమానిని. థ‌గ్ లైఫ్ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారి గురించి. ఇళ‌య‌రాజా త‌ర్వాత త‌న సంగీతంలో న‌న్ను ముంచెత్తింది రెహ‌మానే. వారిద్ద‌రూ మ‌న ద‌క్షిణాది గ‌ర్వ‌ప‌డే గొప్ప క‌ళాకారులు వారు. వారి వ‌య‌సు మ‌నం లెక్క‌పెట్ట‌లేం. న‌న్ను, మ‌ణిర‌త్నంగారిని క‌లిపింది సినిమానే. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని చూసి వేసే విజిల్స్ మాకోస‌మే కాదు..సినిమా కోసం కూడా అని నాకు తెలుసు. నేను ఇక్క‌డున్నందుకు సంతోష‌ప‌డుతున్నాను. సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి కె.చంద్ర‌న్‌గారు గొప్ప టెక్నీషియ‌న్‌. హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లాల్సిన టెక్నీషియ‌న్‌. ఆయ‌న‌తో ప‌ని చేయ‌టాన్ని గ‌ర్వ‌కార‌ణంగా భావిస్తాం. అన్బ‌రివు గొప్ప యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేశారు. ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే అంద‌రూ భ‌విష్య‌త్తులో గొప్ప‌వారు అవుతారు. శింబు త‌నెంత గొప్ప స్థాయిని చేరుకుంటాడో నాకు తెలుస్తుంది. ఈ స‌మూహాన్ని ముందుక న‌డిపే నాయకుడిగా శింబు ఎదుగుతాడు. ఆ బాధ్య‌త త‌న‌కుంది. త్రిష గురించి చెప్పాలంటే బాహ్య సౌంద‌ర్య‌మే కాదు.. మాన‌సికంగా ఎంతో అంద‌మైన‌వారు. మ‌రోవైపు జీవాగా న‌టించిన అభిరామి.. గొప్ప‌గా న‌టించారు. అశోక్ సెల్వ‌న్‌ను చూస్తుంటే నాజ‌ర్‌ను చూస్తున్న‌ట్లే అనిపించింది. నాజ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమాను చూసేట‌ప్పుడు అంద‌రూ ఎంతో సంతోషిస్తారు. కానీ తీసేట‌ప్పుడు చాలా స‌మ‌స్య‌ల‌ను దాటి చిత్రీక‌రించాల్సి ఉంటుంది. అలాంటి స‌మ‌స్య‌ల‌ను నేను ఎన్నింటినో దాటి వ‌చ్చాను. అందుకు కార‌ణం.. అభిమానులే. వారికి నేను ఎలా ధ‌న్య‌వాదాలు చెప్ప‌లో కూడా తెలియ‌టం లేదు. అలాంటి వారి కోస‌మే నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. నేను ముఖ్య‌మంత్రి కావ‌టానికో, ఎం.ఎల్‌.ఎ, ఎం.పి నోమ‌కావ‌టానికి రాజ‌కీయాల్లోకి రాలేదు. ఓ ఎం.ఎల్‌.ఎ ఏం చేస్తాడో దాన్ని త‌మిళ‌నాడుకి మెల్ల‌గా చేస్తున్నాం. నాతో పాటు ఉన్న‌వారంద‌రూ ఇప్పుడు స‌మాజంలో పెద్ద‌వారిగా ముందుకు న‌డుస్తున్నారు. అది నాకెంతో గ‌ర్వంగా ఉంటుంది. రేపు శింబు కూడా త‌న వారిని అలాగే ముందుకు తీసుకెళ్లాలి. నాజ‌ర్‌కు త‌మిళం అంటే.. సినిమా అంటే ఎంత ప్రేమో చెప్ప‌నక్క‌ర్లేదు. చిన్న‌సినిమాలు విజ‌యం సాధించ‌టానికి ఏం చేయాల‌నే దానిపై మేం చాలా సార్లు మాట్లాడుకున్నాం. జో జో జార్జ్ గురించి ముందు నాకు తెలియ‌దు. త‌ను న‌టించిన రెట్టె అనే సినిమా చూశాను. గొప్ప‌గా న‌టించాడు. నేను అసూయ ప‌డే న‌టుల్లో త‌నొక‌డు. చంద్ర‌హాస‌న్ గారి త‌ర్వాత నాకు దొరికిన గొప్ప స‌పోర్ట్ మ‌హేంద్ర‌న్‌. థ‌గ్ లైఫ్ ఓటీటీ, శాటిలైట్ మిన‌హా సినిమాను మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే సినిమాపై ఎంత న‌మ్మ‌కంగా ఉన్నామో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పిస్తుంది. ఈ జ‌ర్నీలో నాకు అండ‌గా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

హీరో శింబు మాట్లాడుతూ ‘‘మద్రాస్ టాకీస్ బ్యానర్ వారికి, సుహాసినిగారికి, శివగారికి, నిత్యాగారికి థాంక్స్. రాజ్ కమల్ ఫిల్మ్స్ మహేంద్రన్‌గారికి థాంక్స్‌. డిస్నీకి ధ‌న్య‌వాదాలు. సినిమాను విడుద‌ల చేస్తున్న రెడ్ జెయింట్ ఉద‌య్‌గారికి, శెంబ‌గ‌మూర్తిగారికి ధ‌న్య‌వాదాలు. ఈ సినీ జ‌ర్నీలో నాకు స‌పోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. నేను చాలా మంది యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌తో వ‌ర్క్ చేశాను. తొలిసారి అన్బ‌రివు మాస్ట‌ర్స్‌తో వ‌ర్క్ చేశాను. చాలా బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి.కె.చంద్ర‌న్‌గారికి ధ‌న్య‌వాదాలు. జోజో జార్జ్‌గారంటే నాకెంతో ఇష్టం. ఆయ‌న స్క్రీన్ ప్రెజ‌న్స్ చూసి నాకు అసూయ‌గా ఉంటుంది. ఐశ్వ‌ర్య ల‌క్ష్మిగారికి థాంక్స్‌. నాజ‌ర్‌గారితో క‌లిసి చాలా సినిమాల‌కు వ‌ర్క్ చేశాను. అయితే ఈ సినిమాలో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో స్పెష‌ల్‌గా అనిపించింది. అభిరామిగారి పెర్ఫామెన్స్ గురించి అంద‌రూ మాట్లాడుకునేంత గొప్ప‌గా ఉంటుంది. అశోక్ సెల్వ‌న్ గ్రేట్ టాలెంటెడ్‌. త‌ను ఫ్యూచ‌ర్‌లో ఇంకా ఎదుగుతాడు. త్రిష‌తో కలిసి నేను విన‌తాండి వారువాయ సినిమా చేశాను. ఈ సినిమా ట్రైల‌ర్ చూసి అంద‌రూ షాక్ అయ్యుంటారు. త్రిష‌గారు చెప్పిన‌ట్లు ఇందులో చాలా స‌ర్‌ప్రైజెస్ ఉంటాయి. రెహ‌మాన్‌గారిని నెనెంతో ఇబ్బంది పెట్టాను. ఆయ‌న‌తో ట్రావెల్ ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఆయ‌న నాకెంతో చేశారు. సింగ‌ర్‌గా నాకు మొద‌టిసారి అవ‌కాశం ఇచ్చింది రెహ‌మాన్‌గారే. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 150 పాట‌లు పాడాను. మ‌ణిర‌త్నంగారి గురించి చెప్పాలంటే.. ఆయ‌న డైరెక్ట్ చేసిన అంజ‌లి మూవీలో అంజ‌లి క్యారెక్ట‌ర్‌కు అన్న పాత్ర‌లో న‌టించిన తెలుగు అబ్బాయిని స్క్రీన్‌పై చూసి ఆ పాత్ర‌కు మ‌ణిగారు న‌న్నెందుకు తీసుకోలేద‌ని ఏడ్చాను. అప్పుడు మానాన్న‌గారు ఏదో చెప్పి న‌న్ను ఓదార్చారు. నేను పెరిగి పెద్ద‌య్యాక మాస్ మ‌సాలా మూవీస్‌లోనే ఎక్కువ‌గా న‌టించాను. దాంతో మ‌ణిగారితో సినిమా చేయ‌లేనేమో అని అనుకున్నాను. ఆ స‌మ‌యంలో నాపై రెడ్ కార్డ్ వేసే సంద‌ర్భం వ‌చ్చింది. అప్పుడు చాలా మంది నిర్మాత‌లు నాతో సినిమా చేయ‌టానికి చాలా భ‌య‌ప‌డ్డారు. అలాంటి స‌మ‌యంలో నాకు మ‌ద్రాస్ టాకీస్ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. వెళ్లి మ‌ణిర‌త్నంగారిని క‌లిశాను. నాతో సినిమా చేయ‌టానికి నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో నాపై న‌మ్మ‌కంతో సినిమా చేసిన ఆయ‌న్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. థ‌గ్ లైఫ్‌లో ముందు న‌న్ను చేయ‌మంటే కొన్ని కార‌ణాల‌తో చేయ‌లేన‌ని చెప్పేశాను. కానీ మ‌ళ్లీ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. అది కూడా ఏకంగా క‌మ‌ల్ సార్‌తో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. థ‌గ్ లైఫ్‌లో ఇలాంటి పాత్ర ఇచ్చిన ఆయ‌న్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. క‌మల్‌హాస‌న్‌గారి గురించి చెప్పాలంటే మాట్లాడుతూనే ఉండొచ్చు. ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి చాలా విష‌యాలు నేర్చుకోవ‌చ్చు.. కాబ‌ట్టి మ‌నం ఆయ‌న్ని గురువుగా భావిస్తే..ఆయ‌న మాత్రం నేను స్టూడెంట్‌నే అని అంటుంటారు. బెస్ట్ స్టూడెంట్ ద‌గ్గ‌ర నేర్చుకోవ‌టంలో త‌ప్పు లేద‌ని నా భావ‌న‌. క‌మ‌ల్‌హాస‌న్‌గారి నుంచి చాలా విష‌యాల‌ను నేర్చుకునే అవ‌కాశం క‌లిగింది. మ‌ర‌చిపోలేని అనుభ‌వ‌మిది. ఆయ‌నిచ్చిన ఆత్మ విశ్వాసంతోనే.. ఆయ‌న‌తో స‌మానంగా చేసే క్యారెక్ట‌ర్‌ను సుల‌భంగా చేయ‌గ‌లిగాను. అంత గొప్ప న‌టుడితో ఇప్పుడు న‌టించ‌గ‌లిగానంటే చిన్న‌ప్ప‌టి నుంచి న‌న్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేసి, ఎంక‌రేజ్ చేసిన నా త‌ల్లిదండ్రులే కార‌ణం. వారికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. ఎవ‌రి స్థానాన్ని మ‌రొక‌రు భ‌ర్తీ చేయ‌లేరు. దాని కోసం చాలా క‌ష్ట‌ప‌డాలి. క‌మ‌ల్ హాస‌న్‌గారు అంత క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే.. ఆయ‌న ఈరోజు ఇంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయ‌న్నుంచి చాలా విష‌యాలు నేర్చుకోవాలి. క‌మ‌ల్‌గారు, మ‌ణిగారు నాపై న‌మ్మ‌కంతో మంచి రోల్ ఇచ్చారు. ఇంకా క‌ష్ట‌ప‌డుతూ మంచి పాత్ర‌లు చేసి ఇంకా మంచి స్థానానికి  చేరుకుని మీరు నాపై పెట్టిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసుకుంటున్నాను. అభిమానులు గ‌ర్వ‌ప‌డేలా సినిమాలు చేస్తాన‌ని చెప్పాను. దానికి థ‌గ్ లైఫ్ ఓ ఆరంభం మాత్ర‌మే. జూన్‌5న రిలీజ్ అవుతోన్న థ‌గ్ లైఫ్ సినిమానే సినిమా ఏంట‌నేది మాట్లాడుతుంది’’ అన్నారు.  

దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ ‘‘నేను థాంక్స్ చెప్ప‌టం ప్రారంభిస్తే కె.బాల‌చంద‌ర్ నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే సినీ ఇండ‌స్ట్రీలోకి రావ‌టానికి కార‌ణం బాల‌చంద‌ర్‌గారు. త‌ర్వాత నాకు మొద‌టి సినిమా ఇచ్చిన వీన‌స్ కృష్ణ‌మూర్తిగారు, స‌త్య‌జ్యోతి త్యాగుగారికి, నిర్మాత వెంక‌టేష్‌గారికి..ఇలా చెప్పుకుంటూ రావాలి. అయితే ఇక్క‌డ నేను ముందుగా ఇద్ద‌రికీ మాత్రం థాంక్స్ చెప్పాల‌నుకుంటున్నాను. అందులో ముందుగా ఈ ఆడియో వేడుకకి కార‌ణమైన ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారికి. ఆయ‌న త‌న జ‌ర్నీలో ఎంతో మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాను ఆయ‌న త‌న మ్యూజిక్‌తో నిల‌బెట్టారు. క‌మ‌ల్ హాస‌న్‌గారు న‌న్ను నాయ‌కుడు మూవీ చేయ‌మ‌న్నప్పుడు .. అంత‌కు ముందు వ‌ర‌కు నిర్మాత‌లతో యుద్ధం చేస్తూ వ‌చ్చాను. కానీ నాయ‌కుడు సినిమా నుంచి ఆ ట్రీట్మెంట్ మారిపోయింది. అంత పెద్ద బ్రేక్ ఇచ్చిన క‌మ‌ల్‌గారికి థాంక్స్‌. అలాగే ఇప్పుడు థ‌గ్ లైఫ్ మూవీ ఇచ్చినందుకు కూడా థాంక్స్‌. 38 ఏళ్ల ముందు నాపై న‌మ్మ‌కంతో నాకు ఎలాగైతే అవ‌కాశ‌మిచ్చి న‌టించారో ఇప్పుడు కూడా అలాగే న‌టించారు. మా బెస్ట్ నేను చేశాన‌నే అనుకుంటున్నాం. ఎంటైర్ టీమ్‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘అభిమానులు ఎలాగైతే ఫ్యాన్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారో.. నేను కూడా ఇప్పుడు ఫ్యాన్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. క‌మల్‌హాస‌న్‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌నంటే అంత ప్రాణం నాకు. ఆయ‌న సినిమాల‌న్నీ తొలి రోజున తొలి షో చూస్తుంటాను. అలాగే మ‌ణిర‌త్నంగారికి, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారికి, శింబుగారికి, త్రిష‌గారికి అభిరామిగారికి థాంక్స్‌. రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంటర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌లో తొలి సినిమా ఓపెనింగ్‌కు క్లాప్‌ను నాన్న‌గారే కొట్టి ప్రారంభించారు. ఆ ప్ర‌యాణాన్ని నేను మ‌ర‌చిపోలేను. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

న‌టి త్రిష మాట్లాడుతూ ‘‘థగ్ లైఫ్ పాటలను ముందుగానే వినే అవకాశం వచ్చింది. 37 ఏళ్లుగా క‌మ‌ల్ స‌ర్‌..మ‌ణి స‌ర్ ఎప్పుడు క‌లిసి ప‌ని చేస్తారోన‌ని అభిమానిగా ఎదురు చూశాను. మ‌ణిర‌త్నంగారితో నాలుగు సినిమాలు చేశాను. నాలుగు మూవీస్ క‌మ‌ల్ హాస‌న్‌గారితో వ‌ర్క్ చేశాను. అలాగే రెహ‌మాన్‌గారి మ్యూజిక్ కంపోజ్‌లో సినిమా చేయ‌టం గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌. న‌టిగా వీటిని గ‌ర్వంగా చెప్పుకుంటాను. క‌ల‌లు నిజ‌మ‌య్యాయ‌నిపిస్తుంది. కొన్ని సినిమాలు ఎంతో స్పెష‌ల్‌గా అనిపిస్తాయి. అలాంటి సినిమానే థ‌గ్ లైఫ్. క‌మ‌ల్‌గారు నేను స్టూడెంట్‌నేన‌ని చెబుతుంటారు.. కానీ ఆయ‌న్నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో నేను చేసిన పాత్ర‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో న‌టించాను. శింబుతో క‌లిసి విన‌తాండి వ‌రువాయ సినిమా త‌ర్వాత క‌లిసి న‌టించాను. ట్రైల‌ర్‌లో రెండు నిమిషాలు మాత్రమే చూశారు. రేపు థియేట‌ర్‌లో సినిమా చూసేట‌ప్పుడు రెండు గంట‌ల త‌ర్వాత అర్థ‌మ‌వుతుంది. ర‌వి.కె.చంద్ర‌న్‌గారితో మ‌రోసారి క‌లిసి వ‌ర్క్ చేశాను. అశోక్ సెల్వ‌న్‌గారికి, అభిరామిగారికి థాంక్స్‌. థ‌గ్ లైఫ్ సినిమాలో వ‌ర్క్ చేయ‌టాన్ని న‌టిగా గొప్ప‌గా ఫీల్ అవుతుంటాను’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో అభిరామి, నాజ‌ర్‌, అశోక్ సెల్వ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి.కె.చంద్ర‌న్ స‌హా ప‌లువురు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ పాల్గొన్నారు.