
జియోహాట్‌స్టార్, డిస్నీ+ హాట్‌స్టార్ నుంచి జియో హాట్ స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా, ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దేవిక & డానీ’ అనే అందమైన కథను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘దేవిక & డానీ’ వెబ్‌సిరీస్ లుక్ పోస్టర్లతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఈ ఆసక్తిని మరింత పెంచుతూ మేకర్స్ ఈ రోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే సిరీస్‌లో టైటిల్ పాత్రధారి దేవికగా రీతూ వర్మ నటించారు. అప్పటికే ఆమెకు సుబ్బరాజుతో నిశ్చితార్థం జరిగి ఉంటుంది. వారి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఓ పూజారి రీతూవర్మ జీవితంలో ఆమె వివాహానికి మూడు నెలల ముందు ఓ కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. అతని రాకతో ఆమె జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయంటూ హెచ్చరిక చేస్తాడు.
పూజారి చెప్పినట్లే డానీ దేవిక జీవితంలోకి ప్రవేశిస్తాడు. డానీ పాత్రను సూర్య వశిష్ట పోషించారు. తనది అంతీద్రియ పాత్ర. డానీ రాకతో దేవిక జీవితం మలుపు తిరుగుతుంది. ఆమె ఊహించినట్లు సంఘటనలు సాగవు. కొన్ని అనుహ్య సంఘటనలు జరుగుతాయి. దీంతో డానీ వైపు దేవిక ఆకర్షితురాలవుతుందని ట్రైలర్‌తో తెలుస్తుంది. ఇదొక రొమాంటిక్, ఎంటాంగిల్‌మెంట్, సస్పెన్స్, అనుకోని మలుపులతో సాగే కథాంశంతో దేవిక అండ్ డానీ తెరకెక్కింది. ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ చూస్తుంటే చాలా ప్రశ్నలు మనసులో రేకెత్తుతాయి..సిరీస్ చూడాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ ప్రశ్నలకు జూన్6న సమాధానం దొరుకుతుంది. శ్రీకారం ఫేమ్ బి.కిశోర్ దర్శకత్వంలో రూపొందిన దేవిక అండ్ డానీ జూన్6 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కామెడీ, హారర్, ఫాంటసీ అంశాలతో సమకాలీన కథనం మేళవిపుంగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు సంగీతం జయ్ కృష్ అందించారు.