
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ ఏలూరు లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా సక్సెస్ ఫుల్ గా జరిగింది.
కథాంశం గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అయిన పవిత్ర వారాహి ఆలయం చుట్టూ తిరుగుతుంది. రాష్ట్ర అండ్‌మెంట్ మంత్రికి ఆ ఆలయం భూములపై కన్నపడి, వాటిని వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగించాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గ్రామ శాంతి భంగం అవుతుంది. అప్పుడు ముగ్గురు స్నేహితులు కలసి, ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు బలంగా నిలబడతారు. వారి మధ్య ఉన్న బంధం, ధైర్యం గ్రామ ప్రజలకు ఆశను నింపుతుంది.
కమర్షియల్ వాల్యుస్ తో కూడిన కథను దర్శకుడు విజయ్ కనకమేడల ఎక్సయిటింగ్, ఇంపాక్ట్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. తొలి షాట్ నుండి చివరి ఫ్రేమ్ వరకు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్రలో వెర్సటాలిటీ చూపించి అదరగొట్టారు, ముఖ్యంగా శివ తాండవం సీక్వెన్స్ , చివరిలో వచ్చే యాక్షన్ సన్నివేశంలో అద్భుతంగా కనిపించారు. మంచు మనోజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ కట్టిపడేశారు నారా రోహిత్ కూడా తన పాత్రను పవర్‌ఫుల్‌గా పోషించి ఆకట్టుకుంటారు. ఈ ముగ్గురు నటుల పర్ఫార్మెన్స్ అద్భుతంగా నిలిచింది, ప్రతి ఒక్కరికి సమానంగా స్కోప్ ఇచ్చిన దర్శకుడికి క్రెడిట్ దక్కుతుంది. ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై పాత్రలు పర్ఫెక్ట్ గా వున్నాయి.
హరి కె వేదాంతం కెమెరా వర్క్ సినిమాకు విజువల్ గ్రాండ్‌నెస్ తీసుకొచ్చింది. శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన నేపథ్య సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్, చిన్నా కె ప్రసాద్ ఎడిటింగ్ మరింత బలాన్ని ఇచ్చాయి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఆకట్టుకున్నాయి. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. యాక్షన్, ఎమోషన్స్ సమర్థంగా మేళవించిన ఈ ట్రైలర్, ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని సూచిస్తోంది.
గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అందరూ ట్రైలర్ ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్ లానే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందరూ సినిమాని సపోర్ట్ చేసి ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. చాలా ప్రేమించి ఇష్టపడి కష్టపడి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చేశాం. మే 30 న భైరవం మీ అందరి ముందుకు వచ్చి మీ అందరిని అలరిస్తుంది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులకు టెక్నీషియన్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఏలూరు ఎంపీ మహేష్ గారికి ధన్యవాదాలు. ఆయన ప్రోత్సహంతోనే ఈ వేడుక ఏలూరులో జరుగుతోంది. ఆయన వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను రాధా మోహన్ గారు ఒక మంచి సినిమా చేద్దామని మొదట్నుంచి అనుకున్నాం. చాలా మంచి కథ దొరికింది. ఇంత మంచి సినిమా తీసిన నిర్మాత రాధ మోహన్ గారికి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. విజయ్ గారు మేకింగ్ ఎమోషన్స్ తో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే భైరవం. శ్రీ చరణ్ మ్యూజిక్ మ్యూజికల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఈ సినిమాకు పని చేసిన దివ్య, ఆనంది అతిధి శంకర్ కి థాంక్యూ. ఈ సినిమాకి కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ విజయం నారా రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడంతో జరిగింది. ఆయన సినిమాని ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్. రోహిత్ అన్న వెరీ నైస్ పర్సన్. మనోజ్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ ని. అన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ మా సినిమాలో చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. గజపతి వర్మ క్యారెక్టర్ లో ఆయన తప్పితే మరొకరిని ఊహించలేం. ఈ వేడుకకొచ్చి ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 30న అందరూ థియేటర్స్ లో కలుద్దాం. లవ్ యూ ఆల్’అన్నారు


హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. నేను ఎప్పుడో చేసిన సినిమాలు గుర్తుపెట్టుకుని అన్న మళ్లీ కం బ్యాక్ ఇవ్వు అని మీరు ఎంతగానో ప్రేమ చూపించారు. మీకు ఎలా థాంక్స్ చెప్పుకోవాలో నాకు తెలియలేదు. సినిమా ద్వారానే మీకు థాంక్స్ చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టిన రోజుల్లో మీరు ఇంత దగ్గరగా చేర్చుకుని ఇంత ప్రేమ పంచుతున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే దానికి మీరే కారణం. నాకు ఇంత ప్రేమ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. తొమ్మిదేళ్ల తర్వాత భైరవం సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు రాధా మోహన్ శ్రీధర్ గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. డైరెక్టర్ విజయ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా చాలా గొప్పగా తీశారు. బెల్లంకొండ సాయి నా తమ్ముడు లాంటివాడు తనతో వర్క్ చేయడం వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. తనకి అన్నగా అండగా ఉంటాను. నారా రోహిత్ నా స్నేహితుడు. చిన్నప్పుడు నుంచి మా అనుబంధం ఉంది. ఫ్యామిలీ గా ఫ్రెండ్ గా అది కొనసాగుతూ ఉంది. 2016లో ఒక్కడు మిగిలాడు అనే సినిమా తీశాను. ఆ సినిమాకి రోహిత్ వాయిస్ ఇచ్చారు. ఆ సినిమాతో ఆపాను. మళ్లీ తిరిగి వస్తుంటే నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. నారా రోహిత్ గారు సాయి గారి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. అందరికీ ఈ సినిమా గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను. నా జీవితంలో ఎన్ని జరిగినా ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకి మాత్రం నా కట్టే కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయిని. అది ఎవరు మార్చలేరు. ఎన్ని జన్మలెత్తినా మీరే నా తండ్రి మీ దీవెనలు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. భైరవ 30 తారీఖున రిలీజ్ అవుతుంది. సినిమా గొప్ప హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ… హాయ్ ఏలూరు. భైరవం నాకు చాలా స్పెషల్ ఫిలిం. బెల్లంకొండ సురేష్ గారు ఈ సినిమాని నా దగ్గరికి తీసుకొచ్చారు. సినిమా చూశాను చాలా నచ్చింది. విజయ్ డైరెక్ట్ అనేసరికి చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది. తను ఉగ్రం నాంది చిత్రాలు అద్భుతంగా తీశాడు. సాయి మనోజ్ రెండు క్యారెక్టర్లు చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది ఈ సినిమాతో మా జర్నీ ఇంకా పెరిగింది ఈ సినిమా నాకు గుర్తుపెట్టుకునే మంచి సినిమా. నిర్మాత రాధ మోహన్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమా నిర్మించారు. మా టీమ్ అందరికీ థాంక్యు. ఈ సినిమా మీ అందరికీ నచ్చిందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మే 30 తారీఖున ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను
డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని చాలా గ్రాండ్ తీశారు మా నిర్మాత. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా టీమ్ అందరు నా కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తారు. మా ముగ్గురు హీరోయిన్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు బెల్లంకొండ సాయి గారికి థాంక్యూ. జై జానకి, రాక్షడుడు సినిమాలకి ఎంత రెవెన్యూ వచ్చిందో ఈ సినిమాతో అంత రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాను. నారా రోహిత్ గారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆయన ఇచ్చిన సపోర్టు మామూలుది కాదు. ఇప్పటివరకు చాలా కొత్త రోహిత్ ని చూడబోతున్నారు. మనోజ్ అన్న లవ్ యు అన్న. గజపతి వర్మ ఎలా ఉంటాడో మే 30 తారీఖున థియేటర్లో చూస్తారు. ఇప్పటివరకు ఆయన తగ్గడమే చూశారు నెగ్గడం ఎలా ఉంటుందో చూస్తారు. ఈ సినిమా తర్వాత మనోజ్ గారు ఏ ఒక్కరోజు ఖాళీగా ఉండరని గర్వంగా చెబుతున్నాను. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 30న ధియేటర్స్ లో కలుద్దాం బ్లాక్ బస్టర్ వైబ్ తో బయటికి వద్దాం థాంక్యూ.
సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో నటించిన హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మంచు మనోజ్ గారు నారా రోహిత్ గారు టీం సభ్యులందరూ ఒక అద్భుతమైన ట్రైలర్ ని లాంచ్ చేయడానికి ఏలూరు రావడం చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ట్రైలర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. ఉద్రిక్తమైన వాతావరణం దేవాలయం నేపథ్యానికి సంబంధించిన కథ కనిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ఇంత గ్రాండ్ గా తీసిన సినిమాలు కచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద చూడాలి తప్పకుండా ఈ సినిమాని థియేటర్ కెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను ఒక మంచి మల్టీస్టారర్ సినిమా. ముగ్గురు హీరోలు ఈ ట్రైలర్ లో చాలా అద్భుతంగా నటించారు. ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని అనిపించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ను


ఎంపీ పుట్ట మహేష్ మాట్లాడుతూ.. హీరోలు బెల్లంకొండ సాయి గారికి రోహిత్ గారికి మనోజ్ గారికి డైరెక్టర్ విజయ్ గారికి ప్రొడ్యూసర్స్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది ముగ్గురు హీరోల్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. చాలా మంచి యాక్షన్ ఉండబోతుంది. మే 30న ఈ సినిమా అందరూ చూసి ఘనవిజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను
ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య మాట్లాడుతూ… అందరికి నమస్కారం ఈ సినిమా ట్రైలర్ ని ఏలూరులో లాంచ్ చేయడం లాంచ్ చేస్తున్నందుకు భైరవం టీం అందరికీ అభినందనలు. ఈ సినిమా తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఆనంది మాట్లాడుతూ.. ట్రైలర్ ని ఏలూరులో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ విజయ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రాధా మోహన్ గారు చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా నిర్మించారు సాయి శ్రీనివాస్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన డాన్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. మనోజ్ గారు రోహిత్ గారు స్వీటెస్ట్ పర్సన్స్ ఈ సినిమా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్
హీరోయిన్ అతిధి శంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ ఈ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. సాయి శ్రీనివాస్ గారు రోహిత్ గారు మనోజ్ గారితో కలిసి నటించడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ట్రైలర్ అదిరిపోయింది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూడండి. మీ అందరికీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది
నిర్మాత కేకే రాధా మోహన్ మాట్లాడుతూ.. హలో ఏలూరు. ఇది మా జిల్లా.. ఇంతమంది ప్రేక్షకులు మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా మా టీం వర్క్ అందరం మనస్ఫూర్తిగా ప్రేమించే ఈ భైరవం సినిమా ని రూపొందించాం. మేము 30న రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లోనే చూడండి. థియేటర్లో చూస్తేనే ఈ సినిమాని ఎంజాయ్ చేయగలరు.
చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏలూరులో ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నందుకు మా మిత్రులు మనోజ్ గారికి రోహిత్ గారికి సాయి శ్రీనివాస్ గారికి నిర్మాతకు డైరెక్టర్ గారికి అభినందనలు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని, ముగ్గురు హీరోల కెరీర్లో మంచి సినిమాగా నిలవాలని ఆశిస్తున్నాను. ఈవెంట్ ని మా జిల్లాలో పెట్టినందుకు మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను
యాక్టర్ అజయ్ మాట్లాడుతూ.. ఈవెంట్ ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ విజయ్ త్వరలోనే పెద్ద మాస్ డైరెక్టర్ కాబోతున్నారు. రాధా మోహన్ గారు చాలా ఫ్యాషన్ ఉన్న నిర్మాత ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతోంది. ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం వెరీ హ్యాపీ.అందరూ తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మూవీ యూనిట్ అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: కెకే రాధామోహన్
సమర్పణ: డా. జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మా కడలి
ఎడిటర్: చోటా కే ప్రసాద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
సాహిత్యం: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్స్: రామకృష్ణ, నటరాజ్ మడిగొండ
పబ్లిసిటీ డిజైనర్: సుదీర్
పిఆర్ఓ: వంశీ-శేఖర్