జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న “ఫణి”

టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ “ఫణి”. ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక నల్ల పాము(బ్లాక్ పైన్) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ విజువల్ వండర్ మూవీలో కేథరిన్ ట్రెసా, మహేష్ శ్రీరామ్, నేహాకృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాధ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షి అనిపిండి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మూవీ టీమ్…సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. జూన్ నెలాఖరులో “ఫణి” చిత్రాన్ని గ్లోబల్ మూవీగా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

సంగీత దర్శకురాలైన డాక్టర్ మీనాక్షి అనిపిండి అమెరికాలో మీనాక్షి సుస్వర అకాడెమీ ద్వారా లైట్ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్, లలిత సంగీతం నేర్పిస్తూ నేటి తరానికి మన సంగీత వారసత్వాన్ని అందిస్తున్నారు. మరోవైపు “ఫణి” చిత్రంతో ఒక విభిన్న ప్రయత్నం చేస్తూ నిర్మాతగా తన అభిరుచి చాటుకుంటున్నారు డాక్టర్ మీనాక్షి అనిపిండి. ఈ చిత్రానికి ఆమె నిర్మాణ బాధ్యతలతో పాటు సంగీతాన్ని అందించారు. డాక్టర్ మీనాక్షి అనిపిండి “ఫణి” చిత్రానికి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ కాబోతోంది. ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు “ఫణి” మూవీ సిద్ధమవుతోంది.

నటీనటులు – కేథరీన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్, నేహా కృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, రంజిత, యోగిత కొంటద్ది, ప్రశాంతి హారతి, సాన్య, ఆకాష్ ఇంటి, ఫీబూ ఫీ, అనిల్ శంకరమంచి, కిరణ్ గుడిపల్లి, బాల కర్రి, దయాకర్, శాండ్రా, కెల్లీ, కార్లా, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్
సమర్పణ – ఏయు & ఐ స్టూడియో పద్మ నాభరెడ్డి
కాస్ట్యూమ్ డిజైనింగ్ – మీరా జగన్నాధ రాజు
ప్రొడక్షన్ డిజైనింగ్ – ప్రత్యూష మికినేని
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
పబ్లిసిటీ ఇంచార్జ్ & డిజిటల్ – మమతా రెడ్డి కాసం, వర్షా జైన్
మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత – డాక్టర్ మీనాక్షి అనిపిండి
రచన – పద్మావతి మల్లాది
ఎడిటర్ – జునైద్
కెమెరామెన్ – బుజ్జి.కె., సాయికిరణ్ అయినంపూడి
సీజీ-వి.ఎఫ్.ఎక్స్ – హెన్రీలిపటోవ్, శ్రీకాంత్ శాఖమూరి
స్టంట్స్ – జాన్ కాన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – డాక్టర్ వీఎన్ ఆదిత్య