‘కృష్ణ లీల’ టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ వివి వినాయక్

యంగ్ ట్యాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ ‘కృష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై  జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ‘ప్రేమించడం, ప్రేమించబడడం.. రెండు కర్మలే. ఈ ప్రేమని అనైతికంగా అనుభవించాలనుకున్నా, అవాయిడ్ చేయాలనుకున్న, అది మరింత కాంప్లికెటెడ్ అయి, ఎన్ని జన్మలైనా నీకు సరైన పాఠం నేర్పే వరకు వదలదు”అనే పవర్ ఫుల్ వాయిస్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

టీజర్ లో దేవన్ క్యారెక్టర్ వేరియేషన్స్, డిఫరెంట్ టైం లైన్స్, మిస్టీరియస్ కథనం.. సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచాయి. నెవర్ బిఫోర్ లవ్ స్టొరీతో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.

దర్శకుడిగా దేవన్ సరికొత్త పంధాలో ఈ ప్రేమ కథని ప్రెజెంట్ చేస్తున్నారని టీజర్ ప్రామిస్ చేస్తోంది. ధన్య బాలకృష్ణన్ తో పాటు వినోద్ కుమార్, యానిమల్ పృధ్వి, రవి కాలే కీలక పాత్రల్లో కనిపించారు. భీమ్స్ సిసిరోలియా బీజీఎం, సతీష్ ముత్యాల కెమరా వర్క్ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. ప్రొడక్షన్  వాల్యూస్  రిచ్ గా వున్నాయి. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

నటీనటులు: దేవన్, ధన్య బాలకృష్ణన్, వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే, తులసి, 7ఆర్ట్ సరయు, ఆనంద్ భరత్
సిబ్బంది:
దర్శకత్వం – దేవన్
నిర్మాత – జ్యోత్స్న జి
బ్యానర్: మహాసేన్ విజువల్స్
కథ & సంభాషణలు- అనిల్ కిరణ్ కుమార్ జి
డీవోపీ – సతీష్ ముత్యాల
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్ – KSR
కొరియోగ్రఫీ -రఘు మాస్టర్
ఫైట్స్ – నందు మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్ – రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్