
సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ వచ్చింది.
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని బ్యూటీఫుల్ ఫ్యామిలీగా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ బ్యూటీఫుల్ గా వుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా రూపొందుతోంది.
ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్ డీవోపీగా పని చేస్తున్నారు. గణేష్ శివ ఎడిటర్. రాకేందు మౌళి డైలాగ్ రైటర్.
నటీనటులు: సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు, మీఠా రఘునాథ్ , చైత్ర
రచన, దర్శకత్వం: శ్రీ గణేష్
నిర్మాత : అరుణ్ విశ్వ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్. సిబి మారప్పన్
ఫోటోగ్రఫీ డైరెక్టర్: దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్
సంగీతం: అమృత్ రామ్‌నాథ్
ఎడిటర్: గణేష్ శివ
డైలాగ్స్: రాకేందు మౌళి
ఆర్ట్ డైరెక్టర్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్
కాస్ట్యూమ్ డిజైనర్: అశోక్ కుమార్ ఎస్ & కిరుతిక ఎస్
పీఆర్వో: వంశీ- శేఖర్