
ప్రస్తుతం ఆడియెన్స్ కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. కొత్త పాయింట్, కొత్త కథల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక మైథలాజికల్ టచ్ ఉన్న మూవీస్‌కు ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో అందరినీ ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రధాన పాత్రలో ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి.
ప్రస్తుతం ‘త్రిబాణధారి బార్బరిక్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవలె సినిమాను చూసిన టీం ఎంతో సంతోషంగా ఉంది. చిత్రం అద్భుతంగా వచ్చిందన్న కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. పైగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగా రీచ్ అయ్యాయి. సత్య రాజ్ చేస్తున్న ప్రమోషన్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. కంటెంట్ మీద, సినిమా మీదున్న నమ్మకంతో సత్య రాజ్ ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
‘అనగా అనగా కథలా’ అనే పాటతో సత్య రాజ్ ఎమోషనల్‌గా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక ఉదయ భాను నెగెటివ్ షేడ్స్ ఉన్న కారెక్టర్ ద్వారా సినిమా మరింత ఇంట్రెస్టింగ్గా మారనుందని సమాచారం. ఓ మంచి రిలీజ్ డేట్ కోసం చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలోనే సరైన విడుదల తేదీని టీం ప్రకటించనుంది.
తారాగణం: సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్, మేఘన తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన , దర్శకత్వం :మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయపాల్ రెడ్డి అడిదాల
సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
డిఓపి : కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం : ఇంఫ్యూజన్ బ్యాండ్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నా
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజీష్ నంబూరు
లైన్ ప్రొడ్యూసర్ : బి.ఎస్. రావు
ఫైట్స్ : రామ్ సుంకర
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
PRO : సాయి సతీష్