‘శుభం’ 3 రోజుల్లో ఎంత వాసులు చేసిందో తెలుసా?

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నిర్మాతగా భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ అంటూ తన సొంత బ్యానర్ మీద నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ మూవీ మే 9వ తేదీన విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది.

‘శుభం’ ప్రీమియర్లకు మంచి స్పందన రావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ మూడు రోజుల్లో ఈ చిత్రానికి  5.25 కోట్లు వచ్చాయి. మొదటి రోజు కంటే రెండు రోజు ఎక్కువగా వచ్చాయి. ఇలా రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఓవర్సీస్‌లో ఆల్రెడీ  $125K వసూలు చేసింది. మంచి మౌత్ టాక్‌తో ‘శుభం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో సమంత అతిధి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.