థియేట‌ర్స్‌లో ‘శుభం’ సినిమాకు అద్భుత‌ స్పంద‌న‌

ప్ర‌ముఖ న‌టి, నిర్మాత స‌మంత రుత్‌ప్ర‌భు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ . మే9న ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమాకు ప్రీమియ‌ర్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తొలిరోజున సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తొలి రోజున రూ. 1.5 కోట్లు గ్రాస్ కలెక్ష‌న్స్‌ను సినిమా రాబ‌ట్టింది. రెండో రోజున కూడా అదే రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ విజ‌య‌వాడ‌లో కొన్ని థియేట‌ర్స్‌ను సంద‌ర్శించింది. హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్‌, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావ‌ణి ల‌క్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధ‌ర్ గౌడ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కండ్రేగుల త‌దిత‌రులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు చిత్ర యూనిట్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది. సినిమా నిర్మాత‌గానే కాకుండా, గెస్ట్ రోల్ పోషించిన స‌మంత ఎంటైర్ టీమ్ సాధించిన విజ‌యం ప‌ట్ల గ‌ర్వంగా ఉన్న‌ట్లు తెలియ‌జేశారు. చిత్ర యూనిట్ అంతా ప్ర‌తిభావంతులుగా, బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలురని స‌మంత పేర్కొన్నారు.

చిత్ర యూనిట్‌లోని న‌టీన‌టుల చ‌క్క‌టి న‌ట‌న‌, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన శుభం సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అంద‌రినీ అల‌రిస్తోంది. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చ‌క్క‌గా ఉంద‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ ఇన్‌స్టా లైవ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. దానికి స‌మంత స్పందిస్తూ అవున‌ని బ‌దులివ్వ‌టం ద్వారా భ‌విష్య‌త్తులో శుభం2 సినిమా ఉంటుంద‌ని తెలియ‌జేశారు.

శుభం సినిమాలో శ్రావ‌ణి త‌న భ‌ర్త పాత్ర‌లో న‌టించిన శ్రీనివాస్ గ‌విరెడ్డిని రిమోట్ కావాల‌నే స‌న్నివేశం త‌న‌కెంతో ఇష్టమని స‌మంత తెలియ‌జేసింది. ఈ సీన్‌కు ఎంతో క‌నెక్ట్ అయిన ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో స‌మంత సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌కు… ఏదో సాధించాల‌నే వారిలో త‌ప‌న‌, ఏదో నేర్చుకోవాల‌నే వారి మ‌న‌స్త‌త్వాల‌ను అలాగే కొన‌సాగించాలంటూ సమంత స‌ల‌హానిచ్చారు.

సినిమాలో త‌ను చేసిన గెస్ట్ అప్పియ‌రెన్స్‌లో న‌టించ‌టంపై స‌మంత స్పందిస్తూ ‘నేను క్యామియో చేయాల‌ని ముందుగా అనుకోలేదు. షూటింగ్ ముందు రోజు కూడా చేయ‌న‌నిచెప్పాను. అయితే ఇప్పుడు ఆ స‌న్నివేశంలో న‌టించ‌టంపై చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ఇన్‌స్టా లైవ్ చివ‌ర‌లో శుభం మూవీలో మ‌రిడేష్ పాత్ర‌లో న‌టించిన న‌టుడు రాగ్ మ‌యూర్ క‌నిపించారు. త‌న‌కంటే సినిమా బండిలో మ‌రిడేష్ బాబు పాత్ర‌లో న‌టించిన మెప్పించిన రాగ్ మ‌యూర్ ఎంట్రీకే ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంద‌ని స‌మంత ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

మంచి క‌థ‌, క‌థ‌నం, ఊహించ‌ని ట్విస్ట్‌లు, హాస్యం, సస్పెన్స్‌ల క‌ల‌యిక‌తో రూపొందిన శుభం సినిమాలో న‌టించటం గురించి త‌మ అనుభ‌వాల‌ను పంచుకోవాల‌ని న‌టీన‌టుల‌ను స‌మంత కోరగా, వారు త‌మ అనుభ‌వాల‌ను ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేస్తూ శుభం సినిమా జ‌ర్నీలో తామెంతో ఎంజాయ్ చేశామ‌ని వారు తెలియ‌జేశారు.