నాని కి ఎంతదేశభక్తి ఉందో తెలిస్తే షాక్ అవుతారు

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్  HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.  మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది . ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు..

సక్సెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సక్సెస్ సెలబ్రేషన్ గురించి డిస్కస్ వచ్చినప్పుడు దేశంలో పరిస్థితి సెన్సిటివ్ గా ఉంది కదా సెలబ్రేషన్స్ చేయొచ్చా అనే చర్చ వచ్చింది. శత్రువులు మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. దానికి  మన దేశం, సైన్యం చాలా హుందాగా బదులు చెప్పింది. వాళ్లు చేసిన పని వల్ల ఇండియాలో ఒకచోట సక్సెస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ అయిందని ఒక సాటిస్ఫాక్షన్ కూడా వాళ్లకి ఇవ్వకూడదని ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మనల్ని ఏమీ చేయలేకపోయారని స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. లెట్స్ సెలబ్రేట్.. లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ. సైన్యంలో ఉన్న అందరికీ నా, మా టీం తరపునుంచి ఏ బిగ్ సెల్యూట్. హిట్ 3 సినిమా విషయానికొస్తే ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నాను కానీ ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ ని ఒక బిగ్ మాస్ కమర్షియల్ సినిమాలా  సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అద్భుతం అనిపించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు అన్ బిలియబుల్ సెట్స్ వేశారు. డిఓపి సాను గారు నా ఫేవరెట్. ఆయనతో నాది 4వ సినిమా. కథ చెప్పడానికి ఆయన బిగ్ స్ట్రెంత్. మిక్కీ సినిమాకి ఒక కొత్త టోన్ సెట్ చేసిన సౌండింగ్ ఇచ్చారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్యు. సతీష్, లీ చాలా అద్భుతమైనటువంటి ఫైట్స్ ని డిజైన్ చేశారు. తెలుగు సినిమాలో ఎప్పుడు చూడని ఫైట్స్ ని ఆడియన్స్ చూశారు. శైలేష్ తో వర్క్ చేయడం చాలా ఫన్ గా ఉంటుంది. తను చాలా కూల్ గా పని చేసుకుంటూ వెళ్తాడు. తను ప్రతి సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు.తనకిహిలేరియస్  కామెడీ టైమింగ్ ఉంది . తనతో నేను చేయబోయే నెక్స్ట్ సినిమా మాత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ ఆలోచన చెప్పాడు చాలా బాగుంది . ఇది చాలా స్పెషల్ డే. నా ఫేవరెట్ ఫిలిం జగదేకవీరుడు అతిలోకసుందరి రీరిలీజ్ అయింది.హిట్3  సక్సెస్ సెలబ్రేషన్ జరుగుతోంది. శ్రీ విష్ణు సింగిల్ సినిమా రిలీజ్ అయింది. శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కామెడీ చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.అలాగే సమంత శుభం సినిమా గురించి కూడా చాలా మంచి రిపోర్ట్స్ వింటున్నాను అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి. ఇండస్ట్రీ బాగుండాలి. ఈ సినిమా సందడి థియేటర్స్ లో ఎనర్జీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి శేష్ కి నాకు మధ్య ఒక మంచి అనుబంధ ఉంది. హిట్2 తో అది మరింత పెరిగింది. ఇప్పుడు మా ఇద్దరినీ స్క్రీన్ మీద చూడడం పర్సనల్ గా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.  థాంక్యూ సో మచ్. థాంక్యూ కార్తీ. మీరు ఇంకా సినిమా చూడాలి కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళను. శ్రీనిధి శెట్టిది ఫిల్టర్ లేని వ్యక్తిత్వం. చాలా హానెస్ట్ గా మాట్లాడుతుంది. తను ప్రమోషన్స్ కి చాలా హెల్ప్ అయ్యింది. అందుగాను ప్రొడక్షన్ తరఫునుంచి ప్రొడ్యూసర్ నానిగా థాంక్యూ చెప్తున్నాను. మృదుల క్యారెక్టర్ ని అద్భుతంగా చేసింది. వీఆర్వో వంశీ శేఖర్, చాయ్ బిస్కెట్ అనురాగ్ వీళ్లంతా ఒక ఫ్యామిలీ లాగా పని చేస్తారు. అలాంటి టీమ్స్ నాతో ఉన్నందుకు గ్రేట్ బ్లెస్సింగా భావిస్తున్నాను. హిట్ 3 వండర్ఫుల్ జర్నీ.ఒక బ్లాక్ బస్టర్ తో కంప్లీట్ చేస్తున్నాం. 2025 అటు కోర్ట్ ఇట హిట్ 3.. వెరీ మెమరబుల్ ఇయర్. 2026 దీన్ని మించి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. థాంక్యూ సో మచ్’అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ముందుగా మన దేశం కోసం మన సైనికులు పోరాడుతున్న  విధానం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వాళ్లు గర్వపడేలా మనం జీవించాలి అనిపించింది. ఈ సెలబ్రేషన్స్ గురించి నానికి అడిగినప్పుడు ప్రభుత్వం మనకి అండగా ఉంది సైన్యం మనల్ని రక్షిస్తుంది అంతా నార్మల్ గా ఉండాలి, ఆ సందేశాన్ని జనాల్లోకి పంపిద్దాం అని అన్నారు ఆ మాట నాకు చాలా నచ్చింది. సినిమా విషయానికొస్తే హిట్3 ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అర్జున్ సర్కార్ మృదుల ఫెంటాస్టిక్ గా ఉన్నారు. సినిమా ధియేటర్లో  మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నా చిన్న అపీరియన్స్ కి చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడం హ్యాపీగా అనిపించింది. త్వరలోనే మీ అందరిని థియేటర్స్ లో కలవాలని చూస్తున్నాను. అప్పటివరకు హిట్ 3 వైబ్ ని ఎంజాయ్ చేద్దాం’ అన్నారు

ప్రొడ్యూసర్ దీప్తి మాట్లాడుతూ.. హిట్ 3  ట్రైలర్లో సర్వైవ్ అవ్వలేవు అనే ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగు నాని చిన్నప్పుడు నుంచి వింటున్నాడు. తను సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు మేమందరం కూడా ఇక్కడ సర్వ్వైవ్ కాలేవు అని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు తను సర్వైవ్ అవ్వడమే కాదు చాలా గొప్పగా ఎదిగాడు. తనలాగా ఎందరో స్ట్రగుల్ అయినా వాళ్లని ఎదిగేలా చేశాడు. ఫ్యాన్స్ అందరితో కూర్చుని సింగిల్ స్క్రీన్ లో ఈ సినిమా చూడడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నాని ఎప్పటికప్పుడు తనని కొత్తగా మలుచుకుంటున్నాడు. ఐయామ్  ప్రౌడ్ అఫ్ ఇండియన్, ఐయామ్ ప్రౌడ్ అఫ్ నాని. ఐయామ్ ప్రౌడ్ అఫ్ తెలుగు ఆడియన్. అందరికీ థాంక్యు.

హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ శైలేష్ గారికి ముందుగా థ్యాంక్. చాలా ప్యాషన్ తో ఈ కథ చెప్పారు అంతే ప్యాషన్ తో తీశారు. ఫ్యూచర్లో ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలు తస్తారు. ఆయన సక్సెస్ నా సక్సెస్ గా భావిస్తున్నాను. మృదుల క్యారెక్టర్ కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు. ప్రశాంతి దీప్తి గారికి థాంక్యూ. ఈ జర్నీలో ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా కెరీర్ బిగినింగ్ నుంచి ఎంతో సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. నాని గారు చాలా సిన్సియర్ హానెస్ట్. నాని గారితో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వండర్ఫుల్ జర్నీ. సినిమాకి ఎంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా మనకోసం వీరోచితంగా పోరాడుతున్న మన సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. సినిమా విషయానికి వస్తే.. మొదటి నుంచి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్లిన మీడియాకి థాంక్యూ. మంచి కంటెంట్ ని ఆదరిస్తారని ఆడియన్స్ మరొకసారి ప్రూవ్ చేశారు. జనాలు థియేటర్స్ కి రాని సమయంలో ఒక మంచి హిట్ ఇచ్చారని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ థాంక్యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు సినిమాకి ఒక యూనిక్ టోన్ ని సెట్ చేస్తూ డిఫరెంట్ సెట్స్ ని వేశారు. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారు సినిమాకి చాలా స్టైలిష్ కట్ ఇచ్చారు. మిక్కీ జే మేయర్ గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆడియన్స్ మ్యూజిక్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. డిఓపి షాను గారు అద్భుతమైన వర్క్ ఇచ్చారు ఆయనతో మళ్ళీ మళ్లీ కలిసి వర్క్ చేయాలనే ఉంది. ఈ సినిమాకి పని చేసిన అందరి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శ్రీనిధి శెట్టి మృదుల క్యారెక్టర్ ని అద్భుతంగా చేసింది. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ చేసింది. ఎక్కడ కూడా డూప్ వాడలేదు. నాని గారితో జర్నీ స్టార్ట్ అయినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన వ్యక్తితో జర్నీ చేసినప్పుడు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వాలని ప్రతి రోజు హార్డ్ వర్క్ చేస్తూ ఈ జర్నీ సాగింది. ఈరోజు ఈ సక్సెస్ మీట్ లో నాని గారిని ఇంత రిలాక్స్ గా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను. నాని గారితో ‘ఐయాం ప్రౌడ్ అఫ్ యు శైలేష్’ అనిపించుకోవడం గ్రేట్ మూమెంట్. ఆయన  నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారికి థాంక్యూ. హిట్ ఫ్రాంచైజీ పై ఆయన ప్రేమ ఎప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు

పావని మాట్లాడుతూ.. హిట్ లో  నా క్యారెక్టర్ కంటిన్యూ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాని గారికి డైరెక్టర్ గారికి థాంక్యూ. హిట్ ఫ్రాంచైజ్ ఇంకా బిగ్గర్ కావాలని నాని గారు మరెన్నో మంచి సినిమాలు చేస్తూ యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు

యాక్టర్ శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం మాటల్లో చెప్పలేని అనుభూతి. హిట్ తో నా కెరీర్ మొదలైంది. నాని గారికి డైరెక్టర్ శైలేష్ గారికి థాంక్యూ. నాని గారు నాకు ఇన్స్పిరేషన్ . ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

యాక్టర్ అమిత్ మాట్లాడుతూ.. నాని అన్నతో ఎప్పటినుంచో వర్క్ చేయాలని ఎదురుచూస్తున్నాను. హిట్ 3 తో అవకాశం రావడం చాలా ఆనందాన్నిచ్చింది. అందరికీ కంగ్రాజులేషన్స్. ఇలాంటి సినిమాలు మరెన్నో తీసి న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.

ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర మాట్లాడుతూ.. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాని గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు ఈ సినిమాని చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. కంప్లీట్ ఇండియన్ సినిమాల ఉండాలని మొదట్నుంచి మేము డిస్కస్ చేసుకుని డిజైన్ చేయడం జరిగింది. ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ కి వచ్చిన ప్రశంసలు నాపై మరింత బాధ్యతను పెంచాయి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు