
చిత్ర పరిశ్రమలో తమ లుక్ ను మార్చుకోవడం కోసం అటు యాక్టర్లే కాకుండా కొంతమంది ఆర్టిస్టులు ఇంకా యాంకర్లు కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ మధ్య ఒక యాంకర్ కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో బాగా వైరల్ గా మారాయి. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బోలా శంకర్ వంటి తదితర చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉన్నప్పటికీ ఈమె యాంకర్ గాని ఎంతో ఫేమస్ గా మారారు. బుల్లితెరపై ప్రేక్షకులను నిరంతరం వినోదపరిచే శ్రీముఖి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. అయితే ఇటీవల కాలంలో ఓ బుల్లితెర షోలో ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సరదాగా బయట పెట్టడంతో ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో ఎంతో వైరల్ గా మారాయి. తన టెన్త్ క్లాస్ ఫోటోలు చూపించడంతో ఆ ఫోటోలు తనవే అని స్వయానా శ్రీముఖి చెప్పారు. తను అప్పటిలో రెండు బిర్యానీ ప్యాకెట్లు తినేసేదానిని అని, 108 కిలోల బరువుతో ఎంతో కష్టంగా నడిచేదానిని అంటూ తన గురించి తానే చాలా సరదాగా బయట పెట్టారు. అయితే నిజంగా తాను శ్రీముఖినెనా లేదా కేవలం వైరల్ కావడం కోసం తనకు దగ్గర పోలికలో ఉండే వేరే ఎవరో ఫోటోలు అలా చూపించారా అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తుండగా సృజన శ్రీముఖిని ఆ ఫోటోలు తనవే అని ఒప్పుకోవడంతో ఆ ఫోటోలు మరింత వెడల్ గా మారాయి.