
1965లో భారతదేశానికి పాకిస్తాన్ కు మధ్య యుద్ధం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆనాటి అగ్ర నటుడు అయినా ఎన్టీఆర్ జరిగిన యుద్ధం పై స్పందిస్తూ తన వంతు సహాయంగా నిలబడడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన తన అభిమానులకు ఇంకా తెలుగు ప్రజలకు ఈ విధంగా స్పందిస్తూ విజ్ఞప్తి చేశారు.
“ఈనాడు మన భద్రత కోసం, దేశ గౌరవం కోసం దుష్టశత్రువుని ఎదుర్కొని పీకల సంఘంలో ప్రాణ త్యాగం చేస్తున్న సోదరభారత వీర సైనికుల సహాయార్థం దేశ రక్షణ సహకారానికై నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రాలలో ప్రదర్శనయలు సంకల్పించుకున్నాను. నా అభిమానుల ఆదరణ, యావత్ ఆంధ్ర ప్రజానీకం ఆశీస్సులు, మా పరిశ్రమ అండదండలు ఈ ప్రజాహిత కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని విశ్వాసము గతానుభవమే. నన్ను ఈ కార్యానికి గుడి కొలిపినవి నా అభిమానులు, కళాపోషకులు, చలనచిత్ర పరిశ్రమల యొక్క అనుసంద వ్యాపార సంస్థల, సహకార సంపత్తులు, ఆశీస్సులు ప్రార్థిస్తూ మాతృదేశ సంరక్షణకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ నాడు నందమూరి తారక రామారావు గారు దేశ సైనికుల కోసం ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తన దేశభక్తిని చాటుకుంటూ ఆర్థికంగా అలాగే తనదైన కలను ప్రదర్శిస్తూ దేశానికి అండగా నిలబడ్డారు.