
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘కర్మణ్యేవాదికారస్తే’ క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నేడు(గురువారం) రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్ హైలెట్గా నిలుస్తోంది.
ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో బ్రహ్మాజీ, శత్రు,బెనర్జీ తదితరులు కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ గారు ఉషస్విని ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అమర్ దీప్ చల్లపల్లి డైరెక్టర్ గా చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ముఖ్య అతిథిగా హాజరై టీమ్ కి విషెస్ చెప్పారు.
హీరో మాస్టర్ మహేంద్ర మాట్లాడుతూ….”నాకు సినిమా చేయటం అంటే చాలా ఇష్టం. కానీ ఏదో ఒక కేరక్టర్ చేశాం అని అన్నట్లుగా కాకుండా మంచి కథలు చేయాలని నాకు అనిపిస్తుంది.అలా అనుకుంటున్న టైంలోనే ఈ సినిమాని నాకు చెప్పారు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటుంది.ఫస్ట్ హాఫ్ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది.నాకు సినిమా తప్ప ఇంకా ఏమి తెలియదు. నాలాగా సినిమానే ప్రపంచం అనుకునే వాళ్ళకి ఇలాంటి ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. సినిమా మీద వున్న నమ్మకంతో ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లారు.బ్రహ్మాజీ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను.ఈ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ గా వుంది. థ్యాంక్ యూ..” అన్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు చాలా థ్యాంక్స్. ఈ స్టేజ్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా ఫస్ట్ డెబ్యూ సినిమా. నన్ను నమ్మి నామీద నమ్మకంతో ఇలాంటి ఒక చాలెంజింగ్ రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరికీ చాలా థాంక్స్. మహేందర్ తో కలిసి నటించడం చాలా బాగుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక మంచి సినిమా నీ ముందుకు తీసుకు వస్తున్నాం. ట్రైలర్ కూడా చాలా బాగుంది సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిలిం.” అని అన్నారు.


బ్రహ్మాజీ గారు మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం. ముందుగా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే ఆపరేషన్ సింధూర్.. ఇలాంటి ఒక స్పెషల్ రోజున పాత్రికేయ మిత్రులను కలవడం చాలా ఆనందంగా ఉంది . ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే మన ఇంట్లోనే ఉంటారు అని ఒక చక్కటి కాన్సెప్ట్ తో డైరెక్టర్ గారు ఈ సినిమాని మన ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసిన కొత్తలో సినిమా మీద ఒపీనియన్ చాలా తక్కువగా ఉండేది కానీ రోజురోజుకీ షూటింగ్ టైంలో ఈ కంటెంట్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. కంటెంట్ ఏంటి ఇంత బాగుంది అనిపించింది. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇకపోతే క్లైమాక్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా ఎంతో ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు. ఈ మధ్యకాలంలో కంటెంట్ వున్న చిన్న సినిమాలే ఎక్కువగా ఆడుతున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. జైహింద్..” అని అన్నారు.
బెనర్జీ గారు మాట్లాడుతూ..”కర్మణ్యే వాదికారిస్తే అనేది ఒక పాజిటివ్ అండ్ పవర్ ఫుల్ ఎమోషనల్ టైటిల్.టైటిల్ తోనే ఫస్ట్ పాజిటివ్ వైబ్ కనిపించింది, ఆ తర్వాత ఇప్పుడు పోస్టర్స్ చూస్తుంటే మరింత పెరిగింది. బ్రహ్మాజీ, శత్రు, మహేంద్ర అండ్ హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో ఇన్ డెప్త్ స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో కొత్త వాళ్ళు చేశారా లేదా పాత వాళ్ళు చేశారా అనేది కాకుండా ఎంత బాగా చేశారు అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో కొత్త జనరేషన్ వాళ్లు చాలా చక్కగా ప్రోగ్రెసివ్ గా చేస్తున్నారు. కరోనా తరువాత సినిమాలు థియేటర్ వరకు వెళ్లడం కష్టమైపోతుంది అలానే సినిమాలు చచ్చిపోతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం చిన్నవి పెద్దవి అన్న తేడా లేకుండా మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్.” అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు మాట్లాడుతూ..”ఈ రోజుల్లో సినిమా అనేది థియేటర్ల వరకు వెళ్లాలి అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక మంచి కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనే భేదం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కరోనా తరువాత సినిమా ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బ తింది. ఇప్పుడిప్పుడే జనాలు మళ్ళీ థియేటర్లకి వచ్చి సినిమాలను చూస్తున్నారు. ఇకపోతే బ్రహ్మాజీ ఒక సీనియర్ ఆర్టిస్టుగా కాకుండా ఇందులో తనకు ఇచ్చిన పాత్రకు 100% న్యాయం చేశాడు. అలానే చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన మహేందర్ ఒక మంచి పాత్ర పోషించాడు. ఇందులో ఉన్న కంటెంట్ కూడా చాలా బాగుంది. ఈరోజు కంటెంట్ సినిమాను బతికిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ సినిమా కూడా ప్రేక్షకుల మన్నను పొందుతుంది అని నేను భావిస్తున్నాను. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్..” అని అన్నారు
డైరెక్టర్ మాట్లాడుతూ..”ఈ సినిమా చేయడం కోసం చాలా కష్టపడ్డాను. ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది. సినిమా కూడా అంతే బాగుంటుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. నామీద నమ్మకంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా మారి ఇంతమంచి కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ప్రొడ్యూసర్ గారికి కూడా నా ధన్యవాదాలు. దయచేసి అందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూడవలసిందిగా కోరుతున్నాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నాం అందరూ సపోర్ట్ చేస్తారు అని భావిస్తున్నాను.”అని అన్నారు
ప్రొడ్యూసర్ మాట్లాడుతూ..”డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి ఈ సినిమా కోసం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని ఒక మంచి ప్రోడక్ట్ గా బయటికి తీసుకురావాలి అని నా వంతు కృషి నేను చేశాను. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభువు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు.ఈ సినిమాని ఒక చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాగా మీరు ఆదరిస్తారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. థాంక్యూ..”అని అన్నారు.
మధుర శ్రీధర్ గారు మాట్లాడుతూ… “ట్రైలర్ బాగా నచ్చింది ట్రైలర్, టీజర్, ఆడియో మా మధుర ఆడియోలో రిలీజ్ చేయడం చాలా సంతోషగా వుంది బ్రహ్మాజీ గార్కి అభినందనలు తెలుపుతూ ఎక్సక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేంద్ర గారు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడానికి ఎంతో శ్రమిస్తూ నన్ను ప్రతి రోజు ఫాలోప్ చేస్తున్నారు ఈ మూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
నటి నటులు: బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్(నూతన పరిచయం). ఇరా దయానంద్(నూతన పరిచయం), అయేషా(నూతన పరిచయం), రెహానా ఖాన్(నూతన పరిచయం), జయ రావు, బాహుబలి మధు, తదితరులు
బ్యానర్: ఉషస్విని ఫిలిమ్స్
చిత్రం పేరు: కర్మణ్యే వాధికారస్తే
సంగీతం: గ్యాని
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
డి ఓ పి: భాస్కర్ సామల
కథ, మాటలు: శివ కుమార్ పెళ్లూరు
ఫైట్ మాస్టర్: రామ్ సుంకర, డ్రాగన్ అంజి
లిరిక్స్: శ్రేష్ఠ (అర్జున్ రెడ్డి)
స్టిల్స్: మహేష్ పింజల
టీజర్ కట్: వాల్స్ అండ్ ట్రెండ్స్
అసోసియేట్ డైరెక్టర్: ప్రమోద్ తెలకపల్లి
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్, ప్రసాద్ లాబ్స్
మార్కెటింగ్: వంశి కృష్ణ (సినీ డిజిటల్)
పబ్లిసిటీ డిజైనర్: ఏ జె ఆర్ట్స్
నిర్మాత”: డి ఎస్ ఎస్ దుర్గ ప్రసాద్
స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: అమర్ దీప్ చల్లపల్లి