
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా రూపొందుతోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో సాగర్ పాత్రలో రామ్ పోతినేని, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు.
రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని, మ్యూజిక్: వివేక్ – మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, కథ – కథనం – దర్శకత్వం: మహేష్ బాబు పి.