వైరల్ గా మారిన మెగా పోస్ట్

మెగా ఫ్యామిలీ నుండి గుడ్ న్యూస్ వినిపించింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపించాయి. ఇదిలా ఉండగా వారిద్దరూ నేడు వారి సోషల్ మీడియా అయన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ మరింత వైరల్ గా మారింది. వారి జీవితంలోని ఒక గొప్ప పాత్ర రాబోతుందంటూ వారు ఇరువురు ఒకరి చేతిలో ఒకరు పట్టుకుంటూ చాలా చిన్న షూస్ వారి వీళ్ళకు వేసుకొని పెట్టిన పోస్ట్ ఈ వార్తలను నిజం చేస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఇరువురి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని అర్థమవుతుంది.

https://www.instagram.com/p/DJTVV8MRmfU