నానికి మరో 100 కోట్ల చిత్రంగా ‘హిట్ 3’

శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ వర్స్ లో భాగంగా న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం హిట్ 3. ఈ చిత్రంలో నానితో జంటగా శ్రీనిధి శెట్టి నటించకు కోమలి ప్రసాద్, సముద్రఖని, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలకపాత్ర పోషించారు. మే డే సందర్భంగామే 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజులలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసి బాక్సాఫీస్ వద్ద పెద్ద విషయం సాధించింది. ఇప్పటికే గతంలో దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి చిత్రాల ద్వారా 100 కోట్లు కనెక్ట్ చేసిన నాని ఈ చిత్రంతో మరోసారి 100 కోట్ల మార్కెట్ను రీచ్ అయ్యారు. అది కూడా కేవలం నాలుగు రోజులలో 100 కోట్లు సాధించిన ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరుగుతూ ఈ చిత్రం మరింత కలెక్షన్స్ కొల్లగొట్టుతుందని అంచనాలు పెరుగుతూ ఉన్నాయి.