
రాజేంద్రప్రసాద్ తో “తేనెటీగ”, వంశీ దర్శకత్వంలో నరేష్ – వాణి విశ్వనాధ్ లతో “ప్రేమ & కో”, శివకృష్ణతో “బొబ్బిలివేట”, “బడి” వంటి స్ట్రెయిట్ సినిమాలతోపాటు… పలు డబ్బింగ్ చిత్రాల నిర్మాత జవాజి వెంకట రామారావు అలియాస్ తేనెటీగ రామారావు (68) నేటి మధ్యాహ్నం (మే 4, 2025) హైదరాబాద్ లో కన్ను మూశారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామారావు గత కొంతకాలంగా లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు!!