
‘మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్ రాజు గారు ‘లోర్వెన్ AI’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ‘లోర్వెన్ AI’ స్టూడియో ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’అన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
‘లోర్వెన్ AI’ స్టూడియో లాంచ్ ఈవెంట్ లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా మిత్రులు దిల్ రాజు గారు మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు’లోర్వెన్ AI’ స్టూడియోని లాంచ్ చేస్తున్న సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేరుగాంచిన నిర్మాతలు దర్శకులు సినీ రంగంలో వివిధ స్థాయిల్లో వారి పాత్ర నిర్వహిస్తున్న అందరికీ నమస్కారం. దిల్ రాజు గారి విజన్ కి కంగ్రాజులేషన్స్. మూవీ వరల్డ్ కి ఫ్యూచర్స్టిక్ టెక్నాలజీని బిల్డ్ చేసిన దిల్ రాజు గారికి వారి టీం కి అభినందనలు. క్వాంటం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. వారు ‘లోర్వెన్ AI’ స్టూడియోలో భాగస్వామ్యం కావడం అభినందనీయం. తెలంగాణ టెక్నాలజీ డ్రివెన్ స్టేట్. గత మూడు దశాబ్దాలుగా మనం లీడర్స్ ఆఫ్ టెక్నాలజీ అని ఈ వరల్డ్ కి ప్రూవ్ చేసుకున్నాం. హాలీవుడ్ కి ధీటుగా హైదరాబాదు ఎదుగుతోంది. ఈరోజు జరిగిన నాలుగు ప్రొడక్ట్స్ లాంచ్ ఎంటర్టైన్మెంట్ లో గేమ్ చేంజెర్స్ అనిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీని మూవీతో బ్లెండ్ చేయడమనేది ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ స్టెప్. దిల్ రాజు గారు వారి టీం కలిసి చేసిన ఈ ప్రోడక్ట్ అద్భుతం. చాలా సినిమాలు ఎఐ ఇంటిలిజెన్స్ ఆధారంగా వస్తున్నాయి. క్రియేటివిటీని డూప్లికేట్ చేయలేం గానీ క్రియేటివిటీని టెక్నాలజీ తో ఎన్హాన్స్ చేయవచ్చు. టెక్నాలజీ కొత్త అవకాశాలు తెరపైకి వస్తాయి. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ప్రతి రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూవీస్ కూడా న్యూ పేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్తున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్లే లీడర్స్. దిల్ రాజు గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండి లీడర్ గానే ఆయన జర్నీని కొనసాగిస్తున్నా. ఆయన ‘లోర్వెన్ AI’ స్టూడియో నెక్స్ట్ లెవలో టెక్నాలజీ లోకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు ఈ విజన్ తో రావడం చాలా ఆనందాన్నిచ్చింది. దిల్ రాజు గారి లాంటి కింగ్ ఆఫ్ మూవీ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఏఐ లోకి రావడం శుభ పరిణామం. ఆయన ఈ వేడుకకి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దిల్ రాజు గారికి వారి కుటుంబానికి వారి టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు


డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. దిల్ రాజు గారిని ఈ ప్రోడక్ట్ గురించి అడిగినప్పుడు దీనివల్ల చాలా వర్క్ లోడ్ తగ్గుతుందని చెప్పారు. ఈరోజు అది ప్రజెంట్ చేసి చూపించారు. ఏఐ మన ఐడియా ని ఎంతో కొంత ఎన్హాన్స్ చేసి ప్రజెంట్ చేస్తుంది. అది యూజ్ ఫుల్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. మారుతున్న కాలాన్ని బట్టి మనము మారాలి. పరిగెత్తాలి. దిల్ రాజు గారికి ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. రాజుగారు లార్డ్ వెంకటేశ్వర పేరుతోనే ‘లోర్వెన్ AI’ పెట్టారు. వెంకటేశ్వర స్వామి మనందరి ఎమోషన్. క్రియేటివిటీ అనేది ప్యూర్ ఎమోషన్. దిల్ రాజు గారు ఎప్పుడు దూర దృష్టితో ఆలోచిస్తారు. రాజుగారు ఎఐ గేమ్ లో అందరికంటే ముందే ఎంటర్ అయ్యారు. ఈ ప్రోడక్ట్ లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఇందులో అన్ని ఇండియన్ ఫిలిమ్స్ సంబంధించిన ఇంటీలిజెన్స్ ని ఫీడ్ చేశారు. ఇది తప్పకుండా చాలా యూజ్ ఫుల్ గా ఉంటుంది టీమ్ అందరికీ వెరీ బెస్ట్’అన్నారు
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ… దిల్ రాజు గారు మా అందరికీ షాక్ ఇచ్చారు. అందరికంటే ముందుగా ఎఐని అడాప్ట్ చేసుకున్నారు. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటివి చాలా యూజ్ ఫుల్ గా ఉంటాయి. రాజు గారు చాలా హ్యాపీగా ఉంది. ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. దిల్ రాజు గారికి అభినందనలు’అన్నారు
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ… ఇలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్న దిల్ రాజు గారికి ధన్యవాదాలు. నాకు తెలిసిన ఏఐ అంటే దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. నేను మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి ఒక రైటర్ గా జాయిన్ అయ్యాను. ఒక ఐడియా ని ఎలా జనరేట్ చేయాలి దాన్ని ఎలా డెవలప్ డెవలప్మెంట్ చేసుకుంటూ తీసుకెళ్లాలని దిల్ రాజు గారి దగ్గరే చూశాను. ఈ కంపెనీ బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ .. రాజు గారు ఈ ప్రాజెక్టు గురించి చెప్తున్నప్పుడు ఆయన ఎంత హానెస్ట్ గా ఉన్నారో అర్థమైంది. ఈ ప్రోడక్ట్ లో ఆయన పేషన్ కనిపించింది. అప్డేట్ కావడం అంతా ఈజీ కాదు .దిల్ రాజు గారి కి కంగ్రాట్యులేషన్స్. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికి ఆసక్తి ఎదురు చేస్తున్నాను. ఇది క్రియేటివిటీని ఎన్హాన్స్ చేస్తుందని భావిస్తున్నాను. గుడ్ లక్’అన్నారు
దర్శకేంద్రులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ… లార్డ్ వెంకటేశ్వర స్వామిని దిల్ రాజు గారు నమ్ముకున్నారు. కాబట్టి విజయాలే తప్ప అపజయాలు ఉండవు. దిల్ రాజు గారి కాంట్రిబ్యూషన్ కి ఆల్ ది వెరీ బెస్ట్ చెబుతూ ఈ కంపెనీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ.. లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో కలిసి ఈ స్టేజిని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. లార్డ్ వెంకటేశ్వర పేరు పై దిల్ రాజు గారు పెట్టిన అన్ని బిజినెస్ లు సక్సెస్ అయ్యాయి. ఇది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. దిల్ రాజు గారికి ఆల్ ది వెరీ బెస్ట్.

నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఏఐ గురించి గత రెండేళ్లుగా డిస్కషన్ స్టార్ట్ చేశాం. మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం, క్వాంటం తో కలసి సినిమా గురించి డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. 360 డిగ్రీస్ సినిమాని ఎలా చేయొచ్చు అనేది క్రియేటివ్ గా డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్టు ఐడియా నుంచి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేవరకు ఒక స్టేజ్. న్యూ కమ్మర్స్ కి ఇది చాలా యూజ్ ఫుల్ గా ఉంటుందని డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేజర్ గా ప్రీ ప్రొడక్షన్ గురించి ఎంత టెన్షన్ పడుతున్నామో సినిమా వాళ్ళకి తెలుసు. సెకండ్ స్టేజ్ ప్రీ ప్రొడక్షన్. తర్వాత షూటింగ్ ప్రాసెస్, పోస్ట్ ప్రొడక్షన్. తర్వాత ప్రమోషన్స్. ఇలా స్టెప్ బై స్టెప్ గా డెవలప్ డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత చేసే ప్రీ ప్రొడక్షన్ ని ఎఐ లో ఎలా చేయొచ్చు అనేది చేయడం జరిగింది. అది చాలా మిరాకిల్ గా అనిపిస్తుంది. చాలామంది డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి దీని గురించి చూపించడం జరిగింది. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళ అప్రిషియేషన్ ఒక ఎనర్జీని ఇచ్చింది. స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ లో మనం హోమ్ థియేటర్ లో విత్ సౌండ్ ఎఫెక్ట్స్ సినిమా చూడొచ్చు. అది మెయిన్ టార్గెట్. పోస్ట్ ప్రొడక్షన్లో డైరెక్టర్ ఏది అనుకుని సినిమాని తీశాడు ఫైనల్ కట్ సినిమా చూడొచ్చు. ఈ విషయంలో ముఖ్యంగా మూడు టార్గెట్స్ ఉన్నాయి. సక్సెస్ పర్సెంటేజ్ ని పెంచవచ్చు. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లో డైరెక్టర్ కి టైం సేవ్ అవుతుంది. టైమ్ సేవ్ అవ్వడం వల్ల దర్శకులు ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తారు. అలాగే ప్రొడ్యూసర్స్ కి టైం సేవ్ కావడం వల్ల మనీ సేవ్ అవుతుంది. ‘లోర్వెన్ AI’ అనేది ఎమోషన్ లేని ఒక ఫస్ట్ ఏడి గా భావించవచ్చు. ఇది డైరెక్టర్స్ కి క్రియేటివ్ సైట్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. మా సంస్థలో రూపొందుతున్న విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్ధన సినిమా తీస్తున్న డైరెక్టర్ రవికిరణ్ ఇందులో వర్క్ చేస్తున్నాడు. తన స్క్రిప్టు ప్రీ ప్రొడక్షను ఇందులోనే జరుగుతుంది. అలాగే కొత్త వాళ్ళతో చేస్తున్న తెల్ల కాగితం అనే సినిమా కూడా జరుగుతుంది. అలాగే ఒక విఎఫ్ఎక్స్ సినిమా చేయబోతున్నాం. దాని వర్క్ కూడా ఇందులోనే జరుగుతుంది. అలాగే ఒక స్క్రిప్ట్ ని కూడా ఇందులోనే డెవలప్ చేస్తున్నాం. దీన్ని అందరికీ ఉపయోగపడేలా డెవలప్ చేస్తున్నాం .ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం. మా కంపెనీ కాకుండా మిగతా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌసెస్ ‘లోర్వెన్ AI’ కావాలనుకుంటే సంప్రదించొచ్చు. అందరికీ థాంక్యు వెరీ మచ్’అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ గారికి, దర్శకులు రాఘవేంద్రరావు గారికి, ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా అభివందనం. దిల్ రాజు గారు పాతికేళ్లుగా నాకు తెలుసు. ఆయన ప్రతి దాంట్లో ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అదే క్రమంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఏఐ ని ప్రవేశ పెట్టడంలో ముందడుగు వేశారు. సినిమా ఇండస్ట్రీకి ఎఐ ఒక కోలాబరేటరీ అని భావిస్తున్నాను. తన ప్రతిష్టాత్మకమైన కంపెనీని లోగోని లాంచ్ చేసిన అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. సినిమా రసెస్ చూపించి రిజల్ట్ ఏమిటని ఎఐని అడగాలని వుంది’అన్నారు
వైఘా దిల్ రాజు మాట్లాడుతూ.. లోర్వెన్ AI స్టూడియో లాంచ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది డ్రీమ్ కం ట్రూ మూమెంట్. మా ఇష్ట దైవం లార్డ్ వెంకటేశ్వర స్వామి పేరుతో ఈ కంపెనీకి లోర్వెన్ AI అనిపెట్టడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ ఒకదానికొకటి ముడి వేసుకుంటూ ముందుకు వెళుతుంది. లోర్వెన్ AI ఫ్యూచర్ గా భావిస్తున్నాము. థాంక్యూ సో మచ్ క్వాంటం గ్లోబల్ ఏఐ. వారి డెడికేషన్ తో ఈ టూల్ ని డెవలప్ చేయడం జరిగింది. మా లోర్వెన్ AI టీం కి థాంక్యూ. లోర్వెన్ AI ఆలోచన మా హస్బెండ్ దిల్ రాజు గారిది. ఆయన విజన్ మహా అద్భుతం. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసినందుకు థాంక్యూ. అందరికీ థాంక్యూ సో మచ్. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కేఎల్ దామోదర్ ప్రసాద్, సాహు గారపాటి, ఇంద్రగంటి మోహన కృష్ణ, వేణు తదితరలు పాల్గొన్నారు.