ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న పాట “వీక్షణ”

ప్రముఖ సంగీత స్వరకర్త శ్రీ MM కీరవాణి ఆశీర్వదించి, హారిక నారాయణ్ స్వరపరిచిన, పాడిన మరియు ప్రదర్శించిన “వీక్షణ” అనే తాజా తెలుగు ఇండిపెండెంట్ పాటను విడుదల చేసారు. ప్రస్తుతం హారిక నారాయణన్ తెలుగు  సినీ రంగంలో అనేక మంచి చిత్రాలలో విజయవంతమైన పాటలు పాడారు. అలాగే తను తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల సినీ పాటలు కూడా పాడి, మంచి పేరు తెచ్చుకున్నారు. సొంతంగా రచించి, బాణి సమకూర్చి, తనే పాడిన ఒక క్రొత్త ప్రయోగం ఈ పాట. ప్రణవ్ చాగంటి ద్వారా శక్తివంతమైన ర్యాప్‌ను అందించి, 24 ఫ్లిక్స్ బ్యానర్‌పై జితేంద్ర గంజి మరియు వంశీ మొరుసుపల్లి నిర్మించిన వీక్షణ ఒక లోతైన భావోద్వేగ అనుభవాన్ని అందిస్తుంది. మనం చూసే విధానంలో చిన్న మార్పు కూడా అద్భుతమైన మార్పును ఎలా సృష్టిస్తుందో చూపిస్తుంది “వీక్షణ”.