ఘనంగా ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ సక్సెస్ మీట్

ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, “‘సూర్యాపేట్ జంక్షన్’పై మీరు చూపించిన ప్రేమ, ఆదరణ మా హృదయాలను హత్తుకుంది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. పూర్తిగా పాజిటివ్ టాక్ ఉంది. నిన్నటి కంటే ఈ రోజు కలెక్షన్స్ పెరిగినందుకు ఆనందంగా ఉంది. మౌత్ టాక్ కూడా ప్రేక్షకులను థియేటర్ కు వెళ్లేలా చేస్తుంది. మా చిత్ర యూనిట్ ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. మీ ఆశీర్వాదాలకు, సపోర్ట్ కు ధన్యవాదాలు,” అన్నారు.

హీరోయిన్ నైనా సర్వర్ మాట్లాడుతూ, “ప్రేక్షకులు ‘సూర్యాపేట్ జంక్షన్’ సినిమాను ఇంతగా ఆదరించడంలో మాకు ఎంతో ప్రోత్సాహం లభించింది. సినిమా సూపర్ హిట్ టాక్ చేసిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు,” అని చెప్పారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ, “మా సినిమా ద్వారా చెప్పాలనుకున్న సందేశాన్ని ప్రేక్షకులు అందరికీ చేరవేయడం చాలా ఆనందంగా ఉంది. మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు,” అన్నారు.

నిర్మాతలు అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావులు మాట్లాడుతూ, “సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులు, మీడియా, మా టీమ్‌కి మా హృదయపూర్వక ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు.

చిత్ర యూనిట్ మొత్తం సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేసింది.