‘ది ప్యారడైజ్’ vs ‘పెద్ది’

న్యాచురల్ స్టార్ నాని ‘హిట్-3’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటూ, తన నెక్స్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అయితే, ఈ చిత్రం రామ్ చరణ్ ‘పెద్ది’తో బాక్సాఫీస్‌లో తలపడనుంది.

‘హిట్-3’ ప్రమోషన్స్‌లో నాని ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా నాని తన నెక్స్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ను మార్చి 26, 2026న రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. కానీ, మరుసటి రోజే రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ కావడం ఆసక్తికరం. నాని మాట్లాడుతూ, సినిమాల మధ్య పోటీ సహజమని, మార్చి నెల సంక్రాంతి సీజన్‌లా బాక్సాఫీస్ విజయాలతో సందడి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, రిలీజ్ తేదీలపై నిర్మాతలదే ఫైనల్ కాల్ అని, ‘ది ప్యారడైజ్’ షెడ్యూల్ ప్రకారం వస్తుందని నాని స్పష్టం చేశారు. ‘హిట్-3’తో అంచనాలు పీక్‌లో ఉండగా, ‘ది ప్యారడైజ్’, ‘పెద్ది’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్స్‌కు కట్టుబడతాయా? ఈ బాక్సాఫీస్ ఫైట్ ఎవరు గెలుస్తారో చూడాలి.