అనుష్క ‘ఘాటి’ రిలీజ్‌పై సస్పెన్స్

స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఘాటి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతోంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ‘ఘాటి’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఉర్రూతలూగించింది. మేకర్స్ గతంలో ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఊహించని జాప్యంతో రిలీజ్ తేదీపై అయోమయం నెలకొంది. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన లేకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ‘ఘాటి రిలీజ్ ఎప్పుడు?’ అనే ప్రశ్న వైరల్‌గా మారింది. క్రిష్ జాగర్లమూడి నుంచి హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులు, ‘ఘాటి’తో ఆయన మళ్లీ సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నారు. రిలీజ్ తేదీపై త్వరలో స్పష్టత ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.