ఆ సంస్కారం నేను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్నాను : విజయశాంతి

ఇటీవల కాలంలో వైజయంతి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు. ఈ చిత్రానికి సంబంధించి మీడియా వారితో ఓ సమావేశంలో మాట్లాడుతూ దయచేసి ఇకపై ఎవరైనా సరే చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను అలాగే ఇతర ఆడవారిని గౌరవంగా మీరు అంటూ సంబోధించాలి కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ నిజానికి తాను ఇటీవల కాలంలో కొన్ని ఇంటర్వ్యూస్ ఇంకా ఈవెంట్స్ లో తాను చూస్తున్నానని, అక్కడ కొంతమంది చిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్లను అలాగే ఆడవారిని నువ్వు అంటూ సంబోధిస్తున్నారని, అది ఆమెకు బాధ కలిగించిందని తెలిపారు. నిజానికి విజయశాంతి గారు చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో అతి కొద్ది నెలలకే సీనియర్ నటుడు ఎన్టీఆర్ గారితో అలాగే ఏఎన్ఆర్ గారితో నటించిన సమయంలో ఎన్టీఆర్ గారు ఎంతో చిన్న వయసు అయినా తనని మీరు అంటూ సంభోదించడం చూసి తను ఆశ్చర్యపోయానన్నారు. అలాగే ఇతర ఆడవారిని, సిబ్బందిని కూడా మీరు అంటూ సంభవించడం చూసి ఆయన అంత పెద్దవారు అయ్యిండి కూడా అందరిని అలా మర్యాదగా సంభోదించడం చూసి ఆ సంస్కారాన్ని తాను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్నారని చెప్పారు. చిన్నవారైనా పెద్దవారైనా గౌరవించడం అనేది మన సంప్రదాయమని, సంస్కారమని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి మన రాష్ట్రంపై ఉన్న నమ్మకంతో మన సంప్రదాయాలు, సాంస్కృతి, సంస్కారం నచ్చి ఎంతో ఇష్టంగా వచ్చి ఇక్కడ పనిచేసే ఆడవారికి మర్యాద ఇవ్వాలని, అలా మర్యాద ఇవ్వడం, మీరు అని సంబోధించడం మగవారిని ఒక అడుగు ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఉంటుందని అన్నారు. అలా కాకుండా ఎప్పుడైనా ఎవరైనా ఆడవారిని నువ్వు అంటూ సంబోధించినప్పుడు తనకు ఎంతో బాధ కలిగిస్తుందని విజయశాంతి గారు తెలిపారు. అదేవిధంగా చిత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఆమె మీడియా వారితో పంచుకున్నారు.