
రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ED సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేశ్ బాబు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది.