
బుల్లితెర స్టార్, బిగ్ బాస్ ఫేం పావని రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అమీర్‌తో ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. చెన్నైలోని ఓ రిసార్ట్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య వైభవంగా జరిగింది. వీరి పెళ్లి సందడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పావనిరెడ్డి బుల్లితెర ఫేమస్. చాలా సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ బిగ్ బాస్ సీజన్ – 5లో పాల్గొన్నప్పుడు ఆమెకు కొరియోగ్రాఫర్ అమీర్‌తో పరిచయం ఏర్పడింది. సీరియల్స్‌లో ఆమె నటనకు ఫిదా అయిన అమీర్ ఆమెకు ఫ్యాన్ అయ్యారు. బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వగా.. అమీర్ పావనికి ప్రపోజ్ చేశారు. చాలాసార్లు ప్రపోజ్ చేసినా పావని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పావని ఓకే చెప్పగా.. దాదాపు మూడేళ్ల పాటు వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత బంధు మిత్రుల సమక్షంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.
అమీర్ ముస్లిం అయినా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2012 నుంచి పావని రెడ్డి సినిమాల్లో నటిస్తున్నారు. సీరియళ్లలోనూ నటిస్తూ బాగా ఫేమస్ అయ్యారు. తెలుగులో గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ సీరియళ్లలోనూ నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు.
పావనికి 2017లో ప్రదీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, పెళ్లైన కొన్నాళ్లకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె.. ఆ తర్వాత కోలుకుని వరసు సినిమాలు, ప్రోగ్రామ్స్ చేస్తూ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. సరిగ్గా ఆ సమయంలో అమీర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తాజాగా వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు, అభిమానులు విషెష్ చెబుతున్నారు.