
ప్రముఖ డిజిటల్ సినిమా డిస్ట్రిబ్యూషన్, సినిమా అడ్వర్టైజింగ్ సంస్థ యూఎస్ఓ మూవీస్పై కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా (సీసీఐ) జరిమానాను విధించింది. అలాగే దాని అనుబంధ సంస్థలైన క్యూబ్ సినిమా టెక్నాలజీస్, స్క్రాబిల్ డిజిటల్స్ సహా మూడింటికీ కలిపి దాదాపు రూ.2.70 కోట్ల పెనాల్టీని విదించింది. ఈ సంస్థలు అక్రమ వ్యాపార విధానాలను అవలంభిస్తున్నట్లు సీసీఐ పేర్కొంది. ఈ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న థియేటర్ల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ సర్వీసులు, సినిమా కంటెంట్ను అందించే ఇతర పోటీ సంస్థలకు ఎలాంటి వ్యాపార అవకాశాలు దక్క కుండా గుత్తాధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఇలాంటి అనైతిక పద్ధతులను కొనసాగించ వద్దని ఆ సంస్థలను ఆదేశించింది.