
ప్రముఖ నటి సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సమంత సొంత ప్రొడక్షన్ కంపెనీ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద శుభం అనే సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. శుభం చిత్రాన్ని మే 9న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.
ఆల్రెడీ శుభం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సిబుల్, హ్యూమర్‌తో శుభం చిత్రం అందరినీ పాత కాలానికి తీసుకు వెళ్లేలా ఉంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా ‘శుభం’ను మేకర్లు రూపొందించినట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి యువ ప్రతిభావంతులంతా కలిసి పని చేశారు.
వివేక్ సాగర్ ఆకర్షణీయమైన నేపథ్య సంగీతం, క్లింటన్ సెరెజో అందించిన మెలోడీ పాటలు ఈ చిత్రానికి హైలెట్ కాబోతోన్నాయి. ఆకర్షణీయమైన కథ చెప్పడంలో ‘శుభం’ సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సమంత నిబద్దత అందరికీ అర్థం అవుతోంది.
‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్‌తో వినోదాన్ని అందించే చిత్రాలను రూపొందించడమే తన లక్ష్యం. ‘శుభం’ ఆ కోవలోకి చెందే చిత్రం అవుతుంది. ‘శుభం’ కోసం తన టీం ఎంతో కష్టపడింది. ఈ ప్రత్యేకమైన కథను అందరితో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము’ అని సమంత అన్నారు.
మే 9న ప్రపంచవ్యాప్తంగా ‘శుభం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచే చిత్రం అవుతుందని మేకర్లు చెబుతున్నారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ నుంచి మరిన్ని ఎంటర్టైన్మెంట్ చిత్రాలు రానున్నాయని, ఇలానే వినోదాన్ని అందిస్తామని మేకర్లు చెబుతున్నారు.