‘డియర్ ఉమ’ చిత్ర రివ్యూ

తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తూ హీరోయిన్ గా నటిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డియర్ ఉమ. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రంలో దియా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన పృథ్వీ అంబార్ సుమయ రెడ్డి తో జంటగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం చేయగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేశారు. పృథ్వి , కామరాజు, సప్తగిరి, రాజీవ్ కనకాల, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. రధన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ:

ఒక పల్లెటూరి అమ్మాయి ఎంతో ఆశయంగా డాక్టర్ కావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో తనకి సంగీతమే అన్ని అనుకుని ఇంట్లో నుండి గెంటేయబడిన ఒక యువకుడు పృథ్వి పరితచం అవుతాడు. వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. కాని ట్రైలర్ లో చూపించినట్లు సుమయ పని చేసే హాస్పిటల్ లో ఏం జరుగుతుంది? దాని వల్ల వీరికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇంతకు నిజంగానే ఆ హాస్పిటల్ లో వ్యాపారం చేస్తున్నారా లేదా వేరే ఏమైనా జరుగుతుందా? పృథ్వి తన సంగీత ప్రయాణం ఎంత వరకు ముందుకు వెళ్తాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన:

చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన నటి సుమయ రెడ్డి కొత్త అయినప్పటికీ ఎక్కడ కూడా తాను ఒక కొత్త నటి అనే డౌట్ రాకుండా తన నటనతో ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకున్నారు. ఆమె అటు ఎమోషన్ దగ్గర నుండి ఇటు ఇతర సన్నివేశాల వరకు ప్రతి ఫ్రేమ్ లో బెస్ట్ గా పెర్ఫార్మ్ చేశారు. తనతో జంటగా నటించిన నటుడు పృథ్వీ అంబార్ చిత్రంలో అటు యాక్షన్ ఇంకా ఇటు ఎమోషన్ గా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే చిత్రంలో తండ్రి పాత్ర పోషించిన రాజీవ్ కనకాల ఎమోషన్ బాగా పండింది అలాగే పృథ్వీ, కామరాజు, సప్తగిరి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిలో చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

సాంకేతిక విశ్లేషణ:

సుమయ రెడ్డి రాసుకున్న కథకు రాజేష్ దర్శకత్వం బలాన్ని చేకూర్చింది అని చెప్పుకోవాలి. కథను వెండి తెరపై ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడంలో రచయిత ఇంకా దర్శకుల మధ్య ఒక మంచి రాపో ఉంటేనే సాధ్యం అవుతుంది. ఈ చిత్రంలో అది చాల బాగా కనిపించింది. అంతే కాక స్వీయ నిర్మాణం కావడంతో అద్భుతమైన నిర్మాణ విలువలతో మంచి క్వాలిటీ అవుట్ పుట్ తీసుకొచ్చారు. చిత్రంలో సస్పెన్స్ మెయింటైన్ చేయడం ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే విధంగా చూపించారు. చిత్రంలో స్క్రీన్ ప్లే, కలరింగ్, లొకేషన్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థం అవుతుంది. చిత్రం కోసం పని చేసిన వారి అందరిని నిర్మాణ సంస్థ ఎంతో బాగా వాడుకున్నట్లు అర్థం అవుతుంది. పాటలు ఇంకా బిజిఎం చాలా చక్కగా అనిపించాయి.

ప్లస్ పాయింట్స్:

కథ, నటీనటుల నటన, నిర్మాణ విలువలు, సుమయ రెడ్డి నటన బోనస్ గా నిలిచింది.

మైనస్ పాయింట్స్:

ఎడిటింగ్, కొంత బిజిఎం.

సారాంశం:

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారే కాకుండా అన్ని రంగాల ప్రేక్షకులను పూర్తిగా కనువిందు చేసే విధంగా కుటుంబ సమేతంగా చూసేలా డియర్ ఉమ చిత్రం ఉంది.