నేటి నుండి ఆహా ఓటిటి లో స్ట్రీమ్ కానున్న ‘శివంగి’

ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.

ఇటివలే థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా అందర్నీ ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఈరోజు నుంచి తెలుగు వర్షన్ స్ట్రీమ్ అవుతుండగా రేపటి నుంచి తమిళ వెర్షన్ ప్రసారం కానుంది.

ఆద్యంతం ఆకట్టుకునే గ్రిప్పింగ్గా సాగే ఈ థ్రిల్లర్లో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ఆహా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయనుంది. ఈ వీకెండ్ లో డోంట్ మిస్ ఇట్.