
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, సైజీ మంజకర్ జంటగా నటిస్తూ విజయశాంతి గారు కీలకపాత్రలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అర్జున్ S/O వైజయంతి. సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్ప నిర్మాతలకు ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మించబడిన ఈ చిత్రానికి రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ చేయగా అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు. సోహెల్ ఖాన్, పృద్వి, శ్రీకాంత్, సందీప్ వేద్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఎంతో స్ట్రిక్ట్ పోలీసు ఆఫీసర్ అయినటువంటి విజయశాంతి కుమారుడు కళ్యాణ్ రామ్. అయితే పరిస్థితుల్లో ఒక హత్య కారణంగా క్రిమినల్ గా మారతారు. తన కొడుకు క్రిమినల్ గా మారడం ఇష్టం లేని విజయశాంతి తనను దూరం పెడుతుంది. కానీ కళ్యాణ్ రామ్ క్రిమినల్ గా మారడానికి గల కారణం ఏంటి? తన జీవితంలోకి సైజి ఎలా వస్తారు? తన తండ్రి చావుకు కళ్యాణ్ రామ్ పగ తీర్చుకుంటాడా? వీరి జీవితంలోకి సోహెల్ ఖాన్ ఎందుకు వస్తారు? శ్రీకాంత్ పాత్ర ఎంత వరకు ప్రాముఖ్యత ఉంటుంది? చివరికి ఏం జరుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
చిత్రంలో కథానాయకుడు కళ్యాణ్ రామ్ తన నటనతో అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచారు. యాక్షన్ సీన్స్ నుండి, ఎమోషన్ ఇంకా డైలాగ్స్ వరకు పూర్తిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటి విజయ శాంతి గారు కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంట్ ఇంకా ఇతర సన్నివేశాలలో తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకున్నారు. సైజీ తన పాత్రకు తగ్గట్లు నటిస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పృథ్వీ హీరో కళ్యాణ్ రామ్ తో చాలా వరకు సీన్స్ లో కనిపిస్తూ తగ్గ క్యారెక్టర్ లో పూర్తిగా మెప్పించారు. విలన్ గా సోహెల్ ఖాన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే చిత్రంలో నటించిన ఇతర నటీనటులు తమ పాత్రకు తగ్గట్లు నటిస్తూ చిత్రానికి ప్లస్గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ:
ఒక స్ట్రిక్ట్ పోలీసు అధికారి విజయ శాంతి గారి కొడుకుగా కళ్యాణ్ రామ్ ను హీరోగా చూపిస్తూ రాసుకున్న కథ వెండి తెరపై ప్రేక్షకుల మన్నన పొందటంలో మంచి విజయాన్ని సాధించింది. అద్భుతమైన నిర్మాణ విలువలతో ప్రతి సీన్ లోను ఎంత క్వాలిటీ ఉందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. చక్కటి స్క్రీన్ ప్లేతో మొత్తం సినిమా చాలా బావుంది. యాక్షన్ సీన్స్ తో పాటు డైలాగ్స్ మంచి ఇంటెన్షనల్ గా ఉన్నాయి. లొకేషన్స్ ఇంకా సెట్స్ రిచ్ గా ఉన్నాయి. కలరింగ్ ఇంకా ఇతన సాంకేతిక విషయాలలో దర్శకుడు అందరిని బాగా వాడుకున్నారు. అలాగే సీన్స్ కు తగ్గట్లు బిజిఎం మంచి ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది. సాంగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, యాక్షన్ సీన్స్, డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
కొన్ని డైలాగ్స్, అక్కడక్కడ బిజిఎం
సారాంశం:
మంచి యాక్షన్ సినిమాగా విజయ శాంతి ఇంకా కళ్యాణ్ రామ్ మధ్య తల్లిబిడ్డల ఎమోషన్ తో అభిమానులను సంతృప్తి పరిచేలా అర్జున్ S/O వైజయంతి సినిమా ఉంది.