
బాల సత్తారు రచనా దర్శకత్వంలో తమాడ మీడియా నిర్మాణంలో యూట్యూబ్ స్టార్స్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ముఖ్యపాత్రలో నటిస్తూ ఈనెల 19వ తేదీన యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న వెబ్ సిరీస్ 11/A ఏటిగట్టు. విష్ణు ప్రియ, సిద్ధార్థ్ వర్మ, మేఘన, కృష్ణ, సుమహిత, యశ్వంత్ శౌర్య తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తుండగా చరన్ మాస్టర్, మోబిన్, సోనియా సురేష్, విజయ్, అజయ్, స్మైల్ రాజు తదితరులు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి సన్నీ సంకూరు సంగీతాన్ని అందించగా అచ్యుత్ వర్మ సినిమాటోగ్రఫీ చేశారు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ నటుడు ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ టీం ఆకాష్ జగన్నాథ్ ఇంకా నిఖిల్, కిషోర్ లకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలిపారు.
ఇక 11/A ఏటిగట్టు వెబ్ సిరీస్ ట్రైలర్ విషయానికి వస్తే ఓ యువకుడు తన కథను ఒక నిర్మాతకు వివరిస్తూ ఓపెన్ అవుతుంది. కథలోకి వెళ్తే తన దగ్గరికి చేరిన ఒక పుస్తకానికి సంబంధించిన అమ్మాయిని వెతుక్కుంటూ ఆ యువకుడు ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ తన కోసం వెతుకుతుండగా కొంతమంది పరిచయం అవుతారు. అయితే వారిలో ఈ యువకుడు వెతికే అమ్మాయి ఉంటుందా లేదా? మధ్యలో తనకు పరిచయమైన వారి వల్ల తన జీవితంలో వచ్చే మార్పులు ఏంటి? వాడి ద్వారా ఆ యువకుడు ఏం నేర్చుకుంటాడు? ఈ డ్రామా అంతా ఒక రొమాంటిక్ ఇంకా కామెడీ మార్గంలో నడుస్తూ ఉండగా ఎవరు ఊహించని ఒక హఠాత్ పరిణామం జరుగుతుంది. అదేంటి? చివరికి ఆ అమ్మాయిని కలుసుకుంటాడా లేదా? ప్రొడ్యూసర్ తాను చెప్పిన కథను ఒప్పుకుంటాడా లేదా? అనే ప్రశ్నలను ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల మెదడులో పుట్టేలా చేసింది. ఇన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఏప్రిల్ 19న విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.