‘ఓదెల 2’ చిత్ర రివ్యూ

లాక్ డౌన్ సమయంలో ఓటిటి ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం ఓదులకు సీక్వెల్ గా వచ్చిన చిత్రమే ఓదెల 2. ఓదెలకు కంటిన్యూటీగా వచ్చిన చిత్రం కావడంతో ఆ చిత్రంలో ఉన్న కీలకపాత్రలన్ని ఈ చిత్రంలో కనిపిస్తూ ముందుకు సాగుతుంది. తమన్నా ముఖ్య పాత్రలో సంపత్ నంది రచించిన కథకు అశోక్ తేజ దర్శకత్వం వహించగా ఇతర సూపర్ విషయం అంత సంపత్ నంది చూసుకున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, నాగ మహేష్, దయానంద రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల పోషించారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చేయగా మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నేడు విడుదల ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఓదెల చిత్రంలో హెబ్బా పటేల్ తన భర్త వశిష్ట చేసే దాడునాలను గుర్తించి తన భర్తను చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో ముగుస్తుంది. ఓదెల 2 చిత్రం అక్కడినుండి ఏం జరిగింది అనేది కంటిన్యూ అవుతూ మొదలవుతుంది. ఊరిలో అన్ని దారుణాలు చేసిన వశిష్టను చచ్చిపోయిన తర్వాత కూడా శిక్షించాలి అనే ఆలోచనతో వశిష్టకు సమాధి శిక్ష విధిస్తారు. దానితో అగ్రహానికి గురైన వశిష్ట ఆ సమాధి నుండి బయటకు ఎలా వస్తాడు? వచ్చి ఆ ఊరిపై తన పగను ఎలా తీర్చుకుంటాడు? అలాగే నాగ సాధువు అయిన తమన్నా నాకు ఈ ఓదెల గ్రామంతో సంబంధం ఏంటి? తమన్నా రోజులకు రావడానికి గల కారణం ఏంటి? ఇంతకు ఆ దుష్ట శక్తి చివరికి నాశనం అవుతుందా లేదా? ఈ క్రమంలో హెబ్బా పటేల్ ఎటువంటి పాత్రను పోషిస్తుంది? చివరికి ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెరపై ఓదెల 2 చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన :
చిత్రంలో కీలక పాత్ర అయిన నాగ సాధువు పాత్రలో తమన్నా పరకాయ ప్రవేశం చేశారు అని చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో నాగ సాధువుగా తమన్నా అటు సెంటిమెంట్, ఇటువంటి డివోషనల్ అలాగే తన పాతలోని ప్రతి ప్రాముఖ్యతను తన పర్ఫార్మెన్స్ తో ఎంతో చక్కగా తెరపై తన నటనతో చేసి చూపించారు. అలాగే వశిష్ట ఇప్పటికే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ గా అలాగే మరికొన్ని సినిమాలలో పూర్తిగా నెగిటివ్ పాత్రలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో కూడా నెగిటివ్లో అలాగే తన వాయిస్తూ ఎంతో కంభీరంగా కనిపిస్తూ ప్రేక్షకులను భయపెట్టే విధంగా నటించడం జరిగింది. హెబ్బా పటేల్ స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ తన క్యారెక్టర్ కు తగ్గట్లు మంచి ఇంటెన్సిటీతో నటించారు. చిత్రంలో నటించిన శ్రీకాంత్ అయ్యంగర్, మురళీ శర్మ తదితరులు అంతా తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ ప్రతి సీన్ పండేలా చేశారు. అలాగే చిత్రంలో ఇతర పాత్రలు పోషించిన ప్రతి నటీనటులు పూర్తిస్థాయి పర్ఫార్మెన్స్ తో మెప్పించారు.

సాంకేతిక విశ్లేషణ :
ఓదుల చిత్రం బేస్ చేసుకుని తర్వాత భాగాన్ని డివోషనల్ గా చూపించాలని ఆలోచనతో సంపత్ నంది రాసుకున్నదే ఓదెల 2 కథ. కథ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడం జరిగింది. సినిమాలో ప్రతి విషయంలో సినిమాటోగ్రాఫర్ ఎంత శ్రద్ధతో ఈ చిత్రానికి పనిచేశారు అర్థమవుతుంది. అలాగే ప్రతి సీనులను బిజిఎం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ ఇంకా ఇంటర్వెల్ సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఓదెల గ్రామాల్లోకేషన్స్ ఇంకా గుడిలకు సంబంధించిన సెట్లు పని ఉందిగా ఉన్నాయి. అలాగే ప్రతి సాంకేతిక విషయంలోనూ దర్శకుడు అశోక్ ఇంకా సంపత్ నంది ఎంత జాగ్రత్తగా చూసుకున్నట్లు అర్థమవుతుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ ఇంకా చిత్రంలో ఉన్న విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు బాగున్నాయి. క్లైమాక్స్ కొంచెం తేల్చేసినట్లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా చిత్రం అటు సనాతన ధర్మానికి సంబంధించినది కావడంతో కుటుంబ సమేతంగా వెళ్లి చూసే విధంగా ఎంతో అద్భుతంగా ఉంది.

ప్లస్ పాయింట్స్:
నటీనటులు నటన, బిజిఎం, దర్శకత్వం, వి ఎఫ్ ఎక్స్.

మైనస్ పాయింట్స్:
కథ, క్లైమాక్స్.

సారాంశం:
ఒక ప్రేతాత్మని నాశనం చేయడం కోసం సాక్షాత్తు నాగ సాధువు రావడంతో అటు భక్తి పరంగా అలాగే ఇటు సినిమాటిక్ తో ప్రేక్షకులను పూర్తిగా కనువిందు చేసే చిత్రం ఓదెల 2.