
తమిళనాడు తాల అజిత్, త్రిష జంటగా నటిస్తూ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈనెల 10వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని సీన్లను అజిత్ పాత చిత్రాలలోని పాటలను ఉపయోగించడం జరిగింది. అవి ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి. అయితే తాను కంపోజ్ చేసిన మూడు పాటలను తన అనుమతి లేకుండానే ఈ చిత్రంలో ఉపయోగించాలని మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నోటీసులు పంపడం జరిగింది. అంతేకాక ఏడు రోజుల్లో తనకు క్షమాపణలు తెలపాలని ఆ నోటీసులో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇప్పటికే తెలుగు, తమిళ రాష్ట్రాలలో మంచి విజయంతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.